English | Telugu

ఎమోష‌న‌ల్ సీన్‌.. ఇమ్మాన్యుయేల్‌ను హత్తుకున్న రోహిణి!

'జబర్దస్త్' స్టేజ్ మీద కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను ఇలా చాలా మందికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. సుధీర్ అయితే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా ఇలా తనలోని అన్ని కోణాలను బుల్లితెరపై ఆవిష్కరించాడు. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి తనలోని టాలెంట్‌ను బయటపెడుతున్నాడు.

కమెడియన్‌గా పంచ్‌లు వేస్తూ నవ్వించడమే కాదు.. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటిస్తున్నాడు ఇమ్మాన్యుయేల్. అంతేకాకుండా.. ఇత‌డిలో మరో టాలెంట్ కూడా ఉంది. అద్భుతంగా మిమిక్రీ చేయగలడు. ఆడ గొంతుతో మొత్తం పాట పాడగలడు. ఆ మధ్య ఓసారి 'క్యాష్' ప్రోగ్రామ్ లో ఆడ గొంతుతో అలరించాడు. ఇప్పుడు మరోసారి ఆడ గొంతులో పాడి ఆశ్చర్యపరిచాడు.

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో మదర్స్ డే సందర్భంగా అమ్మ పాటను పాడి అందరినీ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. పాటలో ఫీమేల్ వెర్షన్ కూడా తనే పాడడంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. ఇమ్మాన్యుయేల్ పాట విన్న రోహిణి వెంటనే స్టేజ్ పైకి పరుగెత్తుకొచ్చి అతడిని హత్తుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. రోహిణి పలు టీవీ సీరియల్స్ లో నటించడంతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొంది. కానీ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది.