English | Telugu

నాగ‌బాబు రూమ్‌కి పిలిచి క్లాస్‌లు పీకేవారు: రాకెట్‌ రాఘవ

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది 'జబర్దస్త్'. ఈ షోతో చాలా కమెడియన్లు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఎన్నో ఏళ్లుగా అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ షోలో మొదటి నుండి రాకెట్ రాఘవ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. క్లీన్ కామెడీతో ఆకట్టుకోవడానికి అత‌ను ప్రయత్నిస్తుంటాడు.

రాకెట్ రాఘవతో పాటు 'జబర్దస్త్' షోకి వచ్చి చాలా మంది టీమ్ లీడర్స్ షో నుండి బయటకు వెళ్లిపోయారు కానీ రాకెట్ రాఘవ మాత్రం ఇంకా కొనసాగుతున్నాడు. ఈ మధ్యనే 'జబర్దస్త్' అనుభవాల గురించి రాఘవ చెప్పుకొచ్చాడు. 'జబర్దస్త్'లో సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు.. ఇప్పుడు వస్తున్న కొత్తతరం వారి నుండి కూడా నేర్చుకుంటున్నట్లు తెలిపాడు.

ఎప్పుడైనా స్కిట్ సరిగ్గా లేకపోతే రూమ్ లోకి పిలిచి మరీ క్లాస్ తీసుకుంటారని చెప్పాడు. "అంతంత రెమ్యునరేషన్లు తీసుకుంటారు కదా.. స్కిట్ సరిగ్గా చూసుకోవద్దా" అంటూ నాగబాబు అప్పట్లో క్లాస్ పీకేవారని.. ఏమైనా తప్పులు ఉన్నా ముఖం మీదే చెప్పేవారని రాఘవ చెప్పుకొచ్చాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...