English | Telugu
మల్లెమాల ఆస్థాన యాంకర్ రష్మీ వేరే ఛానల్ షో చేస్తే ప్రాబ్లమ్ లేదా?
Updated : Jul 20, 2021
యాంకర్ కాకముందు రష్మీ గౌతమ్ సినిమాల్లో నటించారు. యాంకర్ అయిన తర్వాత బోల్డ్ సినిమాలతో హాట్ టాపిక్ అయ్యారు. అయితే, ఆమెకు క్రేజ్ వచ్చింది మాత్రం 'జబర్దస్త్' కామెడీ షో వల్లే అనేది ఎవరూ కాదనలేరు. ప్రతి శుక్రవారం షోలో కనిపించడం వల్ల ఆమెకు అంత క్రేజ్. దాని తర్వాత 'ఢీ'లో ఆమెకు మల్లెమాల టీమ్ ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు రష్మీ అంటే 'జబర్దస్త్', 'ఢీ' యాంకర్ అన్నంతలా ముద్ర పడింది. మల్లెమాల ఆస్థాన యాంకర్ అనిపించుకున్న రష్మీ, జీతెలుగుకు వస్తే ప్రాబ్లమ్ లేదా? అని టీవీ కమెడియన్లు కొందరు ఆఫ్ ది రికార్డ్ కామెంట్లు చేస్తున్నారట.
'ఆషాడంలో అత్తాకోడళ్ళు' అని జీతెలుగు ఛానల్ ఒక ఈవెంట్ చేసింది. జూలై 25న ఆదివారం టెలికాస్ట్ అవుతుంది. అందులో రష్మీ, సీనియర్ హీరోయిన్ సంగీత సందడి చేశారు. హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రష్మీ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దాన్ని ప్రోమోలో హైలైట్ చేశారు. ప్రజెంట్ ఈటీవీ, జీతెలుగు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరి, రష్మీ ఆ ఛానల్ షో చేస్తే ప్రాబ్లమ్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.
నాగబాబు సహా కొంతమంది జబర్దస్త్ కంటెస్టెంట్లు, అప్పటి 'జబర్దస్త్' డైరెక్టర్లు జీతెలుగుకు వెళ్లి 'అదిరింది' చేయడంతో వివాదం మొదలైంది. అప్పటి నుండి తమ దగ్గర చేసేవాళ్ళ నుండి 'జబర్దస్త్' ప్రొడ్యూసర్లు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. యాంకర్లకు మాత్రం లేవు. అప్పట్లో అనసూయ 'జబర్దస్త్'తో పాటు జీతెలుగు షోలు చేసింది. దానిపై హైపర్ ఆది ఒక స్కిట్ లో కౌంటర్లు కూడా వేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు జీతెలుగులో అనసూయ కనిపించలేదు. 'ఢీ'లో జడ్జ్ అయినటువంటి శేఖర్ మాస్టర్ వేరే ఛానల్ షోలు చేస్తుండటం వల్ల 'ఢీ' నుంచి తప్పించారన్నది ఒక టాక్.