English | Telugu

రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా?

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఆ స్టేజ్ పై ఆమె మెరుపులు మెరిపిస్తున్నారు. త‌నదైన మార్కు యాంక‌రింగ్ తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. ర‌ష్మీకి తోడు సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే గ‌త కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ ల కార‌ణంగా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో క‌నిపించ‌డం లేదు. అయినా ర‌ష్మీ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

Also read:​సుధీర్‌, ర‌ష్మీ జోడీ లేకుంటే 'ఢీ' ప‌రిస్థితి?

ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో భాగంగా సంక్రాంతి స్పెష‌ల్ ఎపిసోడ్ ల‌ని ప్లాన్ చేశారు. `అమ్మమ్మ గారి ఊరు` పేరుతో సంక్రాంతి వంట‌లు అంటూ కొత్త కామెడీ షోని సంక్రాంతి స్ప‌ష‌ల్ గా ప్లాన్ చేశారు. ఈ షోలో హైప‌ర్ ఆది, ప్ర‌దీప్‌, రోజా, ఆమ‌ని, ఆటో రాంప్ర‌సాద్‌, వ‌ర్ష‌, బాబూ మోహ‌న్‌, ర‌ష్మీ గౌత‌మ్‌, ఇమ్మానుయేల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ‌మ్మ .. ఆది, ఆటో రాంప్ర‌సాద్‌, వ‌ర్ష‌ల‌పై వేసిన పంచ్‌లు ఓ రేంజ్ లో పేలి న‌వ్వులు కురిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారింది.

Also read:​దాని కోసం ర‌ష్మి-సుధీర్ క్రేజ్‌ను వాడుకోకండి.. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వార్నింగ్‌!

ఈ ఎపిసోడ్ లో మ‌రో హైలైట్ ఏంటంటే ర‌ష్మీ గౌత‌మ్ `పుష్ప‌`లో స‌మంత చేసిన స్పెష‌ల్ సాంగ్ `ఊ అంటా మావ ఉఊ అంటావా` కు పెర్ఫార్మ్ చేయ‌డం. సమంత ఏ రేంజ్ లో హీటెక్కించిందో అదే స్థాయిలో ర‌ష్మీ గౌత‌మ్ త‌న హొయ‌ల‌తో హీటెక్కించింది. ఈ పాట‌కు ర‌ష్మీ డ్యాన్స్ చేస్తుంటే "ర‌ష్మీ చేస్తే ఎవ‌రైనా `ఊ` అనాల్సిందే" అంటూ పంచ్ వేశాడు హైప‌ర్ ఆది. ర‌ష్మీ కైపెక్కించే చూపుల్తో ర‌చ్చ చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజు ఉద‌యం 9: 00 గంట‌ల‌కు ప్ర‌సారం అయ్యింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...