English | Telugu
పెళ్లిపీటలెక్కిన యాంకర్ రష్మీ.. వరుడు..?
Updated : May 23, 2022
బుల్లితెర బ్యూటీ యాంకర్ రష్మీ జబర్దస్త్ కామెడీ షోలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గతంలో సుడిగాలి సుధీర్ తో కలిసి ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ పాపులర్ అయిన రష్మీ గౌతమ్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ జంట కెమిస్ట్రీని చూసిప జబర్దస్త్ టీమ్ వీరికి రెండు మూడు సార్లు స్టేజ్ పై ఉత్తుత్తి పెళ్లి చేసి మురిసిపోయింది. ఇది నిజమేనా అనే రేంజ్ లో అందరికి షాకిచ్చింది కూడా. అయితే గత కొన్ని వారాలుగా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ ని వీడి సినిమాలతో పాటు ఇతర టీవీ షోల్లో బిజీ అయిపోయాడు. దీంతో ఈ షోకి దూరమయ్యాడు. సుధీర్ లేక పోవడంతో జబర్దస్త్ షో చప్పగా సాగుతోంది.
ఇదిలా వుంటే రష్మీగౌతమ్ పెళ్లిపీటలెక్కింది. వరుడి పక్కన కూర్చుని మురిసిపోయింది. ఇంతకీ రష్మీ పక్కన కూర్చుకున్న పెళ్లి కొడుకు ఎవరన్నది సస్పెన్స్ లో పెట్టేసింది. అసలు రష్మీ పక్కన కూర్చున్న పెళ్లి కొడుకు సుడిగాలి సుధీరేనా లేక మరొకర అన్నది సస్పెన్స్ గా మాంది. ఇంతకీ రష్మీ పెళ్లి పీటలెక్కడం ఏంటీ? .. పక్కన పెళ్లి కొడుకు ముఖం కనిపించకుండా కూర్చోవడం ఏంటీ? .. వివరాల్లోకి వెళితే.. జబర్దస్త్ షో లో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ అప్పుడప్పుడు టీమ్ లీడర్లతో కలిసి స్కిట్ లలో పాల్గొంటోంది. తాజాగా అలాంటి ఓ స్కిట్ లో ఏకంగా పెళ్లి కూతురుగా ముస్తాబై పెళ్లి పీటలెక్కి షాకిచ్చింది.
అయితే తన పక్కన కూర్చున్న వరుడు ఎవరన్నది చూపించకుండా సస్పెన్స్ లో పెట్టారు. రష్మీ పక్కన పెళ్లి పీటలపై కూర్చున్న వ్యక్తి ముఖం కనిపించకుండా మల్లెపూల మాలతో కవర్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టంట సందడి చేస్తోంది. ఈ షో తాజా ఎపిసోడ్ కు గెస్ట్ గా డా. రాజశేఖర్ హాజరు కాగా శ్రద్దా దాస్ జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటి లాగే ఇంద్రజ జడ్జిగా వ్యవహరించింది. తాజా ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కాబోతోంది.