English | Telugu
లవర్ కోసం రష్మీ గౌతమ్ సూసైడ్ కి ప్రయత్నించిందా?
Updated : May 29, 2022
ప్రతీ శుక్రవారం ఈటీవీలో ప్రసారం అవుతున్న కామెడీ షో `ఎక్స్ ట్రా జబర్దస్త్`. గత కొంత కాలంగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ షో కు నటి ఇంద్రజ జడ్జిగా, రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే జూన్ 3న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ లో గెస్ట్ గా `జయం` ఫేమ్, ఒకనాటి పాపులర్ హీరోయిన్ సదా పాల్గొంది. ఈ షోలో సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను గత కొంత కాలంగా టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇటీవల వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులకు సినిమాల్లో అవకాశాలు పెరగడంతో పాటు సుడిగాలి సుధీర్ కు `స్టార్ మా`లో ఇతర ప్రోగ్రామ్ లకు యాంకర్ గా వ్యవహరించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోని వీడి బయటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆటో రాంప్రసాద్ షోని రష్మీతో కలిసి నెట్టుకొస్తున్నాడు. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో రష్మీ గౌతమ్ తో కలిసి ఆటో రామ్ ప్రసాద్ చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తూనే రష్మీ ఫ్యాన్స్ ని ఎమోషన్ కు గురిచేస్తోంది.
తాజా ఎపిసోడ్ లో రష్మీ గౌతమ్ పెళ్లికూతురుగా ముస్తాబై పెళ్లిపీటలెక్కింది. ఈ స్కిట్ లో ఆటో రామ్ ప్రసాద్ .. రష్మీకి అన్నగా కనిపించాడు. తనకు పెళ్లి చేయాలని తపించే వ్యక్తిగా రామ్ ప్రసాద్ ఈ స్కిట్ లో కనిపించాడు. అయితే పెళ్లిపీటలెక్కే సమయానికి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తను వేరే వ్యక్తిని ప్రేమించానని రష్మీ నానా హంగామా చేసింది. నిద్రమాత్రలు మింగేసి సూసైడ్ చేసుకుంటానని షాకిచ్చింది. మనసుకు నచ్చిన వారు పక్కన లేకుంటే ఆ బాధ ఎలా వుంటుందో నీకు తెలుసా? అంటూ ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ ని గుర్తు చేసింది. రష్మీ చేసిన సూసైడ్ హంగామాకు సంబంధించిన `ఎక్స్ ట్రా జబర్దస్త్` ప్రోమో తాజా గా విడుదలై నెట్టింట సందడి చేస్తోంది. ఇందులో రష్మీ చేసిన సూసైడ్ హంగామాతో పాటు ఇమ్మానుయేల్, వర్ష, రోహిణి, బుల్లెట్ భాస్కర్ చేసిన `బాహుబలి` పేరడీ స్కిట్ కూడా నవ్వులు పూయిస్తోంది.