English | Telugu

Brahmamudi : రాహుల్ చేతిలో కొత్త కంపెనీ.. రాజ్, కావ్యల ఆశలకి చెక్ పెట్టనున్నాడా!

స్టార్ట్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -888 లో.....రాజ్ స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీ రాహుల్ కి అని తెలుసుకుంటుంది స్వప్న. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని కావ్యని స్వప్న క్షమించమని అడుగుతుంది. నాకు మరొక ఛాన్స్ ఇస్తున్నందుకు థాంక్స్ అని రాహుల్ అంటాడు. చూసావా అనవసరంగా రాజ్, కావ్యని తప్పు పట్టావని రుద్రాణి పై ఇందిరాదేవి, అపర్ణ కోప్పడుతారు. ఈ రోజు మీ పెళ్లి రోజు అత్తయ్య అందరు హ్యాపీగా ఉండాలి.. వెళ్లి భోజనం చేద్దాం పదండి అని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాజ్, కావ్యలని సీతారామయ్య పక్కకి పిలిచి ఎవరు చెయ్యని పని మీరు చేస్తున్నారు.. కంపెనీ వేరుగా పెట్టడం ఇప్పటివరకు చెయ్యలేదు.. దీనివల్ల ప్రాబ్లమ్ వస్తుందేమోనని సీతారామయ్య అంటాడు. నేను చూసుకుంటాను అని రాజ్, కావ్య అంటారు. మరొకవైపు ధాన్యలక్ష్మి నగలు సర్దుతుంటే రుద్రాణి వస్తుంది. తను రాగానే త్వరగా అన్ని సర్దుతుంది. ఏంటి నేను రాగానే అలా చేస్తున్నావని రుద్రాణి అడుగుతుంది. అదేం లేదు అన్ని నగలు చూసి ఇంకా లేవని అనుకుంటానని ధాన్యలక్ష్మి ఇండైరెక్ట్ గా రుద్రాణితో అంటుంది. నేను అన్ని నగలు చేసుకుంటాను.. నా కొడుకు ఒక కంపెనీకి చైర్మన్ అని రుద్రాణి అంటుంది. అది బాధ్యతలు తెలిసినప్పుడు అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో రుద్రాణి కోపంగా రాహుల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్లు పెద్ద సంస్థలో ఉంటూ నీకు చిన్న కంపెనీ ఇచ్చారని రాహుల్ తో రుద్రాణి అంటుంది.

వాళ్ళు నాకు ఇచ్చింది కంపెనీ కాదు మమ్మీ కత్తి.. దాంతో ఎలా చేస్తానో చూడమని రాహుల్ అంటాడు. మరొకవైపు కావ్య తన కోరికల చిట్టాలో చివరిది బుల్లెట్ బండిపై రైడ్.. ఆ బుల్లెట్ బండిని తీసుకొని వచ్చి కావ్యకి రాజ్ సర్ ప్రైజ్ ఇస్తాడు. నేను నడుపుతానని కావ్య నడుపుతుంది. దాంతో రాజ్ వెనకాల కూర్చొని భయపడుతాడు. మరుసటి రోజు.. నీ కొత్త ఆఫీస్ కి నువ్వు వెళ్ళమని రాహుల్ తో సుభాష్ చెప్తాడు. పాత ఆఫీస్ కి నేను, కావ్య వెళ్తామని రాజ్ చెప్తాడు. ఇక అప్పు కూడా డ్యూటీకి వెళ్తుందని కళ్యాణ్ అనగానే డెలివరీ వరకు వద్దని ధాన్యలక్ష్మి అంటుంది. అయిన ధాన్యలక్ష్మికి తెలియకుండా అప్పుని తీసుకొని కళ్యాణ్ డ్యూటీకీ బయల్దేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.