English | Telugu
ఒక్కసారి పవన్‌కల్యాణ్‌తో.. ప్రియమణి కోరిక!
Updated : Jul 15, 2021
హీరోయిన్‌గా ప్రియమణి కెరీర్ స్టార్ట్ చేసి పద్దెనిమిదేళ్లు. ఈ పద్దెనిమిదేళ్లలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో నటించింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతిబాబు మొదలుకుని ఎన్టీఆర్, నితిన్, రవితేజ, గోపీచంద్ పక్కన సినిమాలు చేసింది. కానీ, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేదు. పవన్‌తో ఒక్క సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను ప్రియమణి బయటపెట్టింది.
ప్రజెంట్ 'ఢీ'లో ప్రియమణి జడ్జ్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పవన్ కల్యాణ్ పాటలు, డైలాగులను మెడ్లీగా తీసుకుని కంటెస్టెంట్ కార్తీక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అది పవన్‌కు ఫెంటాస్టిక్ ట్రిబ్యూట్ అని ప్రియమణి చెప్పారు. తర్వాత పవన్ గురించి మాట్లాడారు.
"నేను ఒకే ఒక్కసారి పవన్ కల్యాణ్ సార్‌ను కలిశా. అప్పటి నుండి ఇప్పటికి నాకు ఓ కోరిక ఉంది. ఎప్పుడైనా ఆయనతో కలిసి ఒక్క సినిమాలో వర్క్ చేయాలని ఉంది. ఆయనతో పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను" అని ప్రియమణి చెప్పుకొచ్చారు. పవన్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు అవకాశం వస్తుందని ఆశిద్దాం. పవన్ చెవిన ప్రియమణి మాటలను కొరియోగ్రాఫర్ గణేష్ వేస్తాడని ఆశిద్దాం. వెంకటేశ్ జోడీగా ఆమె నటించిన 'నారప్ప' మూవీ జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ అవుతోంది.