English | Telugu
ఫుడ్ కోసం కోసం మణికంఠని కొట్టిన పృథ్వీ!
Updated : Oct 17, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం టాస్క్ సూపర్ గా సాగుతుంది. రోజు రోజుకి ఒక్కో కంటెస్టెంట్ యొక్క అసలు రూపం బయటకొస్తుంది. అందులో నేడు రిలీజ్ చేసిన ప్రోమోలో మణికంఠ అసలు స్వభావం బయటకొచ్చింది.
మణికంఠ ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు సింపథీ కార్డ్ యూజ్ చేశాడు. అది చూసి అందరు అపరిచితుడు సినిమాలో రాము క్యారెక్టర్ అనుకున్నారు. ఇక ఆ తర్వాత హౌస్ లోని ఆడాళ్ళ దగ్గర హగ్ కోసం ఎప్పుడు వేచి చూస్తుంటే రెమో అని అనుకున్నారు. కానీ నేడు విడుదల చేసిన సెకెండ్ ప్రోమోలో మణికంఠలోని అపరిచితుడు బయటకొచ్చాడు. సూపర్ ఫోన్, సూపర్ ఛార్జింగ్ టాస్క్ లో భాగంగా ఓజీ అండ్ రాయల్ క్లాన్ ల మధ్య నిన్నటి నుండి టాస్క్ సాగుతుంది. ఇక ఈ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్, నబీల్ మధ్య ఫుల్ గొడవ జరిగిందని వారు ఫిజికల్ అయినట్టుగా మొదటి ప్రోమోలో తెలిస్తోంది. ఇక సెకెంఢ్ ప్రోమోలో పృథ్వీకి, మణికంఠకి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది.
ఒక విషయాన్ని పదే పదే చెప్పడం నాకు రాదంటూ మణికంఠ.. నేనేం అడిగానంటు పృథ్వీ ఇలా ఇద్దరి మధ్య గొడవ బాగా జరిగింది. అసలు ఇది నిజమేనా లేక ఫుడ్ కోసం వీరిద్దరి కలిసి ఇలా ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే మణికంఠ టాస్క్ మొదలవ్వగానే.. నేను గేమ్ ఆడను.. మైండ్ గేమ్ ఆడతాను.. ఇలా కాళ్ళు చేతులు విరగొట్టుకోను అని అన్నాడు. ఇప్పుడేమో పృథ్వీతో గొడవేసుకున్నాడు. నేటి ఎపిసోడ్ లో ఇదే హైలైట్ అయ్యేలా కన్పిస్తుంది. పృథ్వీ, మణికంఠల మధ్య జరిగిన ఈ హీటెడ్ ఆర్గుమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.