English | Telugu

Bigg Boss 9 Family Week Kalyan : కప్పుతో ఇంటికి రావాలి.. మాట తీసుకున్న కళ్యాణ్ తల్లి!

బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. ఒక్కో రోజు ముగ్గురు ఫ్యామిలీస్ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ లలో తనూజ వాళ్ళ అక్క పాప, చెల్లి అనూజ, భరణి వాళ్ల కూతురు, దివ్య వాళ్ళ అమ్మ వచ్చిన ఎపిసోడ్ హైలైట్ గా నిలిచాయి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పడాల వాళ్ల అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనని చూసి కళ్యాణ్ ఎమోషనల్ అయి పరుగెత్తుకుంటూ వెళ్ళి తనని హత్తుకున్నాడు.

ఇక కొడుకును సోఫా దగ్గరికి తీసుకెళ్ళి.. తిను శుభ్రంగా, బాగా సన్నగా అయిపోయావని అడిగింది. సరేనని కళ్యాణ్ అన్నాడు. బాగా తినరా పిచ్చోడా.. పిచ్చిపిచ్చి.. ఇంత మనసులో పెట్టుకున్నావా.. అంటూ కళ్యాణ్‌ తో చెప్తూ ఏడ్చేసింది. ఇక కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది. ఎవరినీ నమ్మకు.. నీతో ఉన్నట్టే ఉంటారు కానీ నీవాళ్ళు కాదని చెప్పింది. కప్పు పట్టుకునే కంపల్సరీ రావాలి.. ప్రామిస్ చెయ్ అంటూ ఆమె అడగ్గానే కళ్యాణ్ ప్రమాణం చేశాడు. నీ కోసం మన ఊరంతా ఎదురుచూస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయిందంటూ కళ్యాణ్ తల్లి ఎమోషనల్ అయింది.

ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ వెళ్ళేముందు.. తన తల్లి చేయి పైకి ఎత్తి.. మొన్నటివరకూ లక్ష్మణ్ రావ్ కొడుకు కళ్యాణ్.. లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు.. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి.. కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు.. నా తల్లిదండ్రుల్ని చూసి గర్వపడుతున్నానంటూ కళ్యాణ్ చెప్పాడు. ఇక బిగ్ బాస్ మామ ఎమోషనల్ సాంగ్ వేసి అందరిని ఏడ్పించేశాడు. అయితే నిన్నటి ఎపిసోడ్ కళ్యాణ్ కి ప్లస్ అవుతుందా లేదా చూడాలి.