English | Telugu

లొకేష‌న్ లో డాక్ట‌ర్ బాబు ర‌చ్చ ర‌చ్చ‌!

`కార్తీక దీపం` సీరియ‌ల్ తో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు పరిటాల నిరుప‌మ్‌. బుల్లితెర శోభ‌న్ బాబుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఈ డాక్ట‌ర్ బాబు ఈ సీరియ‌ల్ లో దేశ వ్యాప్తంగా పాపులారిటీని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. సీరియ‌ల్‌లో డ‌ల్ గా క‌నిపించే డాక్ట‌ర్ బాబు సోష‌ల్ మీడియాలో మాత్రం య‌మ హైప‌ర్. త‌న యాటిట్యూడ్ ని చూపిస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. సెట్ లో షాట్ గ్యాప్ లో డాక్ట‌ర్ బాబు చేస్తున్న ర‌చ్చ‌కు చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తోడ‌వ్వ‌డంతో ఆ హంగామా మ‌రో లెవెల్లో వుంటోంది.

Also Read:ష‌న్ను బండారం బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్‌

మ‌ల్టీ టాలెంటెడ్ అయిన ప‌రిటాల నిరుప‌మ్ బుల్లితెర‌పై డాక్ట‌ర్ బాబుగా ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. స్క్రీన్ పై పాత్ర ప్ర‌భావం వ‌ల్ల డ‌ల్ గా క‌నిపించే డాక్ట‌ర్ బాబు ఆఫ్ స్క్రీన్ మాత్రం రెచ్చిపోతుంటాడు. సెట్‌లో గ్యాప్ దొరికితే చాలు సౌంద‌ర్య‌గా తల్లి పాత్ర పోషిస్తున్న న‌టితో క‌వ‌ర్ సాంగ్ లు చేస్తున్నాడు. అంతేనా ఇదే సీరియ‌ల్ లో త‌న‌కు పిల్ల‌లుగా న‌టిస్తున్న చైల్డ్ ఆర్టిస్టుల‌తో చేరి ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు.

ఇవి ఓ రేంజ్ లో వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో త‌న శ్రీ‌మ‌తి మంజుల‌తో క‌లిసి టిక్ టాక్ వీడియోలు చేసిన డాక్ట‌ర్ బాబు వాటితో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా `కార్తీక దీపం`లో త‌న‌కు కూతుళ్లుగా న‌టిస్తున్న శౌర్య‌, హిమ‌ల‌తో క‌లిసి డాక్ట‌ర్ బాబు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. డైలాగ్స్‌.. డ్యాన్సింగ్ కి సంబంధించిన వీరి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. దీంతో ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ డాక్ట‌ర్ బాబు ర‌చ్చ మామూలుగా లేదుగా అంటూ అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...