English | Telugu

హరితేజ చెప్పిన హరికథకి చేతులెత్తేసిన మణికంఠ!

బిగ్ బాస్ సీజన్-8 ఏడో వారంలో నామినేషన్ల తర్వాత అసలు సిసలు గేమ్ మొదలైంది. సీజన్-4 లో అభిజిత్, అవినాష్ ఉన్నప్పుడు జరిగిన ఛార్జెర్స్, ఫోన్స్ టాస్క్ ని రిపీట్ చేశాడు బిగ్ బాస్.

ఇక ఈ టాస్క్ లో కొత్త రూల్స్ పెట్టాడు బిగ్ బాస్. ఫ్యూచర్ లో స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ చార్జర్స్ మాత్రమే ఉంటాయని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చెప్పగానే అందరు షాక్ అయ్యారు. బిగ్ బాస్ ఇక రూల్స్ చెప్పాడు. ఓవర్ స్మార్ట్ ఫోన్‌లు బతకాలంటే ఛార్జింగ్ కావాలి.. కానీ స్మార్ట్ ఛార్జెస్ ఛార్జ్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు.. అందుకే అసలు గొడవ మొదలైంది.. ఇంటిని అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఫోన్స్‌గా రాయల్స్ క్లాన్.. గార్డెన్ ఏరియాను తమ అధీనంలోకి తీసుకున్న ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌గా ఓజీ క్లాన్ ఉంటారు. ఓవర్ స్మార్ట్ ఫోన్స్ ఛార్జింగ్ సమయం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలానే ఓవర్ స్మార్ట్ ఫోన్స్ లక్ష్యం.. బ్యాటరీ ఎంప్టీ అయి చనిపోకుండా చూసుకోవడం.. ఓవర్ స్మార్ట్ ఫోన్‌కి ఛార్జింగ్ కావాల్సి వచ్చినప్పుడు.. ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఇంటికి కావాల్సినవి అనగా కిచెన్, బాత్రూం.. లివింగ్ ఏరియా, బ్యాడ్ రూంకి సంబంధించిన ఏ వసతి అయినా ఇచ్చి వారి సాకెట్‌లో మీ ప్లగ్‌ను పెట్టి ఛార్జ్ చేసుకోవాలి.. లేదంటే మీ సొంత తెలివితేటలు వాడి కూడా పొందొచ్చు.. ప్రతి ఐదు ఫోన్స్‌కి ఛార్జింగ్ ఇచ్చిన తర్వాత ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్‌కి ఒక బార్ ఛార్జింగ్ తగ్గుతుంది.. టాస్కు పూర్తయ్యే సమయానికి మీ రెండు క్లాన్స్ నుంచి బతికున్న సభ్యులే మెగా చీఫ్ కంటెండర్లు అవుతారంటూ బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు.

మరోవైపు సోఫాలో విష్ణుప్రియ, మణికంఠ కూర్చొని మాట్లాడుకుంటారు. టాస్కు మొదలుకాకముందే.. నేను ఫిజికల్ టాస్కు కోసం బొక్కలు ఇరగ్గొట్టుకోలేను.. ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది.. నేను గాయాలతో బయటికెళ్లలేను.. నాకు హెల్త్ ఇంపార్టెంట్.. కావాలంటే బ్రెయిన్ సపోర్ట్ ఇస్తానంటూ విష్ణుప్రియతో మణికంఠ చెప్పాడు. ఇక గేమ్ లో భాగంగా నబీల్‌ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటే అవినాష్ సైలెంట్‌గా వెనకాల నుంచి ఛార్జ్ పెట్టేసుకున్నాడు. కానీ ఒక నిమిషం కాలేదు కాబట్టి కౌంట్ చేయలేదు బిగ్‌బాస్. ఇక రాయల్ క్లాన్ పగలగొట్టాల్సిన పాట్స్‌లో ఒక దాన్ని ఆడుకుంటూ విష్ణు పగలగొట్టేసింది. ఇక ప్రేరణ కేబుల్ లాక్కొని అవినాష్ లోపలికి వెళ్లి ఛార్జ్ పెట్టుకోబోయాడు. కానీ డ్రెస్‌కి అటాచ్ అయినప్పుడు మాత్రమే ఛార్జింగ్ కౌంట్ అవుతుందంటూ క్లారిటీ ఇచ్చాడు బిగ్‌బాస్.

మరోవైపు సైరన్ అనుకొని బ్యాటరీ సౌండ్ వచ్చినప్పుడు ఆయాసంగా కుండ పగలగొట్టేసింది రోహిణి. తర్వాత మణికంఠ దగ్గరికెళ్లి ఒక స్మార్ట్ డీలింగ్ చేసుకుంది హరితేజ. నీ గురించి పొగుడుతూ హరికథ చెబుతా ఒక నిమిషం ఛార్జింగ్ ఇస్తావా అని హరితేజ అడుగగా.. నాకు నచ్చితే ఇస్తానంటూ మణికంఠ చెప్పాడు. ఇక మణికంఠ వీరుడు శూరుడు అంటూ పొగుడుతూ బాగానే హరికథ చెప్పింది. దీనికి పొంగిపోయిన మణికంఠ ఒక నిమిషం ఛార్జ్ ఇచ్చేశాడు. దీంతో హరితేజ బ్యాటరీలో ఒక పాయింట్ పెరిగింది. మరోవైపు సైలెంట్‌గా యష్మీ దగ్గర దొంగతనంగా ఛార్జ్ పెట్టుకోవడానికి ట్రై చేసింది నయని. కానీ యష్మీ కింద పడేయడంతో ఆ తర్వాత ఓజీ క్లాన్ మొత్తం వచ్చి నయనీని కిందేసి లాగేశారు. దీంతో ముఖం మీద నయనికి గీసుకుపోయింది. ఇక తర్వాత సైరెన్ సౌండ్ రాగానే కుండ పగలగొట్టడానికి తెగ ట్రై చేశారు రాయల్ క్లాన్. కానీ పృథ్వీ, నిఖిల్ స్ట్రాంగ్‌గా ఆపడంతో ఆ కుండ కాస్త కొట్టాల్సిన చోట కాకుండా బయట కొట్టేశారు రాయల్ క్లాన్. ఇలా ఈ గేమ్ ఇంకా నడుస్తోంది. అయితే ఎపిసోడ్ మొదట్లోనే గంగవ్వని రాయల్ క్లాన్ అంతా కలిసి మెగా ఛీఫ్ కంటెండర్ కోసం ఎంపిక చేశారు. ఇక మిగిలిన వారిలో మెగా ఛీఫ్ కోసం కంటెండర్స్ ఎవరు అవుతారో .. రేపటి ఆటలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.