English | Telugu
సామాన్యులకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్!
Updated : May 27, 2022
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతీ సీజన్ చేస్తున్న రచ్చ, వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఎవరెన్ని విమర్శలు చేసినా బిగ్ బాస్ సీజప్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా పూర్తయి ఓటీటీ వెర్షన్ రీసెంట్ గా మొదలవడం.. విజయవంతంగా పూర్తి కావడం తెలిసిందే. ఓటీటీ వెర్షన్ లో మహిళా కంటెస్టెంట్ బిందు మాధవి విజేతగా నిలిచింది. దీంతో ఓటీటీ లేటెస్ట్ సీజన్ ముగిసింది. ఇక మరో సీజన్ ప్రారంభం కాబోతోంది.
బిగ్ బాస్ సీజన్ 5 డిసెంబర్ 19న పూర్తయింది. వీజే సన్నీ విజేతగా నిలిచాడు. త్వరలో సీజన్ 6 ప్రారంభం కాబోతోంది. ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగిసిపోయింది. దీంతో సీజన్ 6కి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజన్ 2 లో సామాన్యులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే కానీ ఆ తరువాత సీజన్ లలో సామాన్యుడి ఊసు లేదు. జర్నిలిస్ట్ విభాగం నుంచి ఒకరిని, ట్రాన్స్ జెండర్స్ నుంచి ఒకరిని, డ్యాన్స్ మాస్టర్, కమెడియన్.. యూట్యూబర్ .. ఇలా ఒక్క రంగం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తూ కంటెస్టెంట్ లని హౌస్ లోకి ఆహ్వానిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 6 కోసం మళ్లీ సామార్యుడి రాగం అందుకున్నారు.
సీజన్ 6 ఓ యాంకర్ శివ, శ్రీ రాపాక తో పాటు కొంత మంది యాంకర్ లకు కూడా చోటు కల్పించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. `బిగ్‌బాస్ సీజన్ 6 లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం. ఇన్నాళ్లు మీరు బిగ్ బాస్ షోను చూశారు. ఆనందించారు. ఇప్పుడు మీరు కూడా ఆ ఇంట్లో వుండాలనుకుంటున్నారు కదూ?.. అందుకే స్టార్ మా ఇస్తోంది ఆకాశాన్ని అందుకునే అవకాశం.. వన్ టైమ్ గోల్డెన్ అపార్చునిటీ..గ్రాబ్ టికెట్ టు బిగ్ బాస్ సీజన్ 6` అంటూ నాగార్జున చెప్పిన న్యూస్ సామాన్యులని సర్ ప్రైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట సందడి చేస్తూ వైరల్ గా మారింది.