English | Telugu

వ‌న్ డే లైఫ్ వితౌట్ వైఫ్‌.. కౌశల్ వీడియో వైరల్!

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో కౌశల్ ఫాలోయింగ్ గురించి సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్ కోసం ఏకంగా ఓ ఆర్మీ తయారైంది. ఆ తరువాత కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఈ విషయాలను పక్కన పెడితే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్స్ ఓపెన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. కౌశల్ కూడా అలానే ఓ ఛానెల్ మొదలెట్టాడు. కొన్ని రోజులుగా కౌశల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కౌశల్ భార్య నీలిమకు కరోనా సోకడం.. ఆమె యూకేలో ట్రీట్మెంట్ తీసుకోవడంపై ఆ మధ్య పోస్ట్ లు వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా కౌశల్ ఓ వీడియో షేర్ చేశారు. ఒక రోజు భార్య ఇంట్లో లేకపోతే జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో వీడియోను రూపొందించారు. అయితే ఇందులో బిగ్ బాస్ షో అనుభవం పనికి వచ్చిందని కౌశల్ అన్నారు. వంట వండుకోవడం, తన పని తాను చేసుకోవడం అక్కడే అలవాటు అయిందని చెప్పుకొచ్చారు. మొత్తానికి కౌశల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో తన పర్సనల్ విషయాలను పంచుకోవడంతో పాటు పిల్లలతో ఆడుకుంటూ కనిపించారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...