English | Telugu

స్టార్ మా లో కొత్త సీరియ‌ల్ `నువ్వు నేను ప్రేమ‌`

బుల్ల‌తెర ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ స్టార్ మా ప‌లు విభిన్న‌మైన సీరియ‌ల్స్‌ని అందిస్తోంది. అందులో చాలా వ‌ర‌కు సీరియ‌ల్స్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. కార్తీక దీపం, ఇంటింటి గృహ‌ల‌క్ష్మి, దేవ‌త వంటి విభిన్న‌మైన సీరియ‌ల్స్ తో మ‌హిళా లోకాన్ని అల‌రిస్తున్న స్టార్ మా తాజా గా ఈ సోమ‌వారం నుంచి స‌రికొత్త సీరియ‌ల్ ని అందిస్తోంది. స్టార్ మా అందిస్తున్న కొత్త సీరియ‌ల్ నువ్వు నేను ప్రేమ‌`.

ప్ర‌తీ సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు సాయంత్రం 6:30 నిమిషాల‌కు ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కానుంది. ఈ సోమ‌వారం నుంచి ఈ సీరియ‌ల్ ప్ర‌సారం ప్రారంభం కాబోతోంది. ఇందులో ప్రేమ మాత్ర‌మే కాకుండా రెండు కుటుంబాల బంధాలు, మమ‌తానురాగాలు, బాధ్య‌త‌ల నేప‌థ్యంలో ఈ సీరియ‌ల్ సాగ‌నుంది. ఓ యువ‌కుడి అహంకారానికి, ఓ యువ‌తి ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య సాగే అంద‌మైన క‌థ‌గా దీన్ని మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

కుటుంబ భారీన్ని మోయ‌డానికి ఉద్యోగంలో చేరిన ఓ యువ‌తికి, త‌న అహంకారంతో ఓ యువ‌కుడు ఎలాంటి ఇబ్బందుల్ని క‌లిగించాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. గొడ‌వ‌ల‌తో మొద‌లైన వీరి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? ..త‌రువాత వారి జీవితాల్ని ఎలా ఒక్క‌టి చేసింది? అన్న‌దే ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన క‌థాంశంగా క‌నిపిస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో ఆక‌ట్టుకుంటూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...