English | Telugu

నోయ‌ల్‌కు 'సంపుత‌రా' అని వార్నింగ్ ఇచ్చిన భానుశ్రీ‌! ఎందుకో తెలుసా?

బిగ్‌బాస్ సీజ‌న్ తో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్ ల‌తో ఈ మ‌ధ్య `స్టార్ మా` వ‌రుస ఈవెంట్ లు చేస్తోంది. ఫెస్టివెల్స్ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా వీరిపై ఈవెంట్ ల‌ని, స్పెష‌ల్ షోల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇవి స‌క్సెస్ అవుతుండ‌టంతో ఏ చిన్న అకేష‌న్ వ‌చ్చినా వారిని ప్ర‌ధానంగా వాడుకుంటూ ప్రోగ్రామ్ లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ల‌తో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ గ‌త వారం ప‌ది రోజులుగా జ‌రుగుతోంది.

ఈ షూటింగ్ కార‌ణంగానే ఆనీ మాస్ట‌ర్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డింది. ప్ర‌స్తుతం కోలుకున్న ఆనీ మ‌ళ్లీ సెట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. సీజ‌న్ 5లో కంటెస్టెంట్ లు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. వారినే ప్ర‌త్యేకంగా తీసుకుని ఓ స్పెష‌ల్ షోని చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఇందులో సీజ‌న్ 4, సీజ‌న్ 3, సీజ‌న్ 2 కంటెస్టెంట్ లు కూడా పాల్గొంటున్నారు. అందులో నోయెల్‌, భానుశ్రీ‌, రోల్ రైడా క‌నిపించారు.

Also Read:నాటి `మాస్ట‌ర్`కి జోడీగా నేటి `మాస్ట‌ర్` బ్యూటీ!

ఈ ఈవెంట్ కు సంబంధించిన షూటింగ్ లు రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా కంటిన్యూగా జ‌రుగుతున్నాయి. కోవిడ్ భ‌యంతో కొంత మంది ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ ని ఎవాయిడ్‌ చేస్తూ ఇంటి వ‌ద్ద నుంచే ఫుడ్ తెచ్చుకుంటున్నారు. భానుశ్రీ‌, రోల్ రైడా ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజీల‌ని భోజ‌న విరామ స‌మ‌యంలో కూర్చుని ఆర‌గిస్తుండ‌గా నోయెల్ వీడియో తీశాడు. ఈ వీడియోకు "స‌రిపోక‌పోతే ఇంకా ఆర్డ‌ర్ చేద్దామా"? అని భానుశ్రీ .. రోల్ రైడాని అడుగుతున్న‌ట్టుగా కౌంట‌ర్లు వేస్తూ వీడియో తీశాడు నోయెల్.. దీన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌డంతో భానుశ్రీ రియాక్ట్ అయింది. "సంపుత‌రా" అంటూ నోయెల్ పై సీరియ‌స్‌ కావ‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది.