English | Telugu

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తానంటున్న‌ డాక్టర్ బాబు!

మహిళా ప్రేక్షకుల్లోసినీ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఫాలోయింగ్ డాక్టర్ బాబుది. అదేనండీ... 'కార్తీక దీపం'లో డాక్టర్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా ప్రేక్షకులకు సుపరిచితుడైన నిరుపమ్ పరిటాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టీవీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న నిరుపమ్, త్వరలో ఓటీటీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడాలని చూస్తున్నాడు.

కరోనా తరువాత ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటానికి ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఇంటి దగ్గర ఉన్నవాళ్లు ఖాళీ సమయంలో డిజిటల్ షోలు చూడటం మొదలుపెట్టారు. అందుకని, ఓటీటీలోకి డాక్టర్ బాబు రావాలని అనుకుంటున్నాడు.

"ప్రస్తుతానికి టీవీ ఇండస్ట్రీ బావున్నా... భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడంతా వెబ్ హవా నడుస్తోంది. సీరియళ్లు అంటే మహిళలకు మాత్రమే అనే ముద్ర పడింది. పైగా, యువతరం వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అందుకని, వెబ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. పరిస్థితులకు అనుకుణంగా చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగాలనేది నా అభిమతం" అని లేటెస్టుగా ఒక డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ చెప్పాడు.

సో... భవిష్యత్తులో డాక్టర్ బాబును ఓటీటీలో చూసే అవకాశం ఉందన్నమాట. అలాగే, మంచి అవకాశాలు వస్తే సినిమాల్లోనూ నటించాలని నిరుపమ్ పరిటాల చెబుతున్నాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...