English | Telugu
"నన్ను చాలా మంది తిడుతున్నారు".. వాపోయిన డాక్టర్ బాబు!
Updated : Jun 19, 2021
బుల్లితెరపై హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు 'కార్తీకదీపం' డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల. ఈ సీరియల్ తో పాటు 'హిట్లర్ గారి పెళ్లాం' అనే మరో సీరియల్ కూడా చేస్తున్నారు. అయితే నిరుపమ్ ఎక్కడికి వెళ్లినా.. 'కార్తీకదీపం' సీరియల్ గురించే అడుగుతుంటారట. వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ మోనిత ప్రెగ్నెంట్ న్యూస్ తో మరింత ఆసక్తికరంగా మారింది.
దీప, కార్తిక్ లు కలుస్తారనుకునే సమయంలో మోనిత ఇచ్చిన ట్విస్ట్ తో సీరియల్ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో నెటిజన్లు ఈ సీరియల్ కు ముగింపు ఉండదా..? దీప, కార్తిక్ లు ఎప్పుడు కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై చాలా మంది తనను తిడుతున్నారని.. పర్సనల్ మెసేజ్ లు కూడా పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల.
ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కార్తీకదీపం' సీరియల్ గురించి మాట్లాడారు. ఈ సీరియల్ ఇంత క్లిక్ అవుతుందనుకోలేదని అన్నారు. వంటలక్క క్యారెక్టర్ విన్నప్పుడు సక్సెస్ ఫార్ములా కాబట్టి నమ్మకం ఏర్పడిందని.. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదని చెప్పారు. మీమ్స్, ట్రోల్స్ చూసినప్పుడు నవ్వుకుంటానని.. తిట్టినప్పుడు మాత్రం ఫీల్ అవుతుంటానని అన్నారు. తనకు పర్సనల్ గానే చాలా మంది మెసేజ్‌లు పెట్టి తిడుతుంటారని... ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోనని అన్నారు.