English | Telugu
'హిట్లర్ గారి పెళ్ళాం' టైమింగ్ మార్చడం నిరుపమ్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు!
Updated : Jul 22, 2021
'అమ్మ చేసిన త్యాగం కూతురికి అర్హతగా దక్కుతుందా?' - కొన్ని రోజులుగా ఒక్క హుక్ డైలాగ్, ప్రోమో 'జీ తెలుగు' ఛానల్‌లో ప్రతి సీరియల్ మధ్య వినపడుతోంది. జూలై 26 నుండి టెలికాస్ట్ కానున్న 'స్వర్ణ ప్యాలెస్'కు విపరీతమైన పబ్లిసిటీ ఇస్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది.
అయితే, మరి ఆ సమయంలో వస్తున్న 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ సంగతేంటి? అంటే.... దాని టైమింగ్‌ను మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మార్చారు. 'రామ చక్కని సీత'ను పన్నెండింటికి ప్రసారం చేయనున్నారు. 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియల్ అభిమానులకు టైమింగ్ మార్చడం ఎంతమాత్రం ఇష్టం లేదు. సోషల్ మీడియాలో సీరియల్స్ టైమింగ్స్ చేంజ్ చేస్తున్నట్టు 'జీ తెలుగు' పేర్కొంది. కొంతమంది అభిమానుల నుండి వెంటనే నిరసన వ్యక్తం అయింది. కామెంట్స్ సెక్షన్ లో 'హిట్లర్ గారి పెళ్ళాం' టైమింగ్ చేంజ్ చేయవద్దని చాలామంది చెప్పారు.
మరి, వాళ్ళ అభ్యర్థనను ఛానల్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. 'స్వర్ణ ప్యాలెస్'తో కొంత విరామం తర్వాత చందన శేగు మళ్ళీ తెలుగు టీవీకి వస్తున్నారు.