English | Telugu
బిగ్ బాస్ అనేది వేస్ట్ షో... బేబక్క వీడియో వైరల్
Updated : Sep 11, 2024
సోషల్ మీడియాలో బెజవాడ బేబక్క అంటే తెలియని వారుండరు. ఎందుకంటే కామెడీ పండించడంలో, సెటైర్స్ వేసి నవ్వించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. జెంట్స్ లో కామెడీ యాంగిల్ కామన్ . కానీ లేడీస్ లో మాత్రం కొంచెం ఆ యాంగిల్ తక్కువగా ఉంటుంది. అలాంటి కామెడీ చేసే కొందరిలో బెజవాడ బేబక్క ఎంతో ఫేమస్. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారంలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేయడంతో ఆమె ఇంకా ఫేమస్ ఐపోయింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఆమె రీసెంట్ గా ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ వాళ్ళు మెరుపు తీగలా పని చేయమన్నారు అందుకే ఇలా వెళ్లి అలా ఆ హౌస్ నుంచి ఈ హౌస్ కి వచ్చేసాను అని చెప్పింది.
అలాగే బయటకు వచ్చేసరికి 20 వేల మంది ఫాలోవర్లు కూడా పెరిగిపోయారని తెలిసి వాళ్లకు ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చేసింది. ఎంత కాలం ఉన్నామన్నది కాదన్నయ్యా...ఎంత మంచిగా ఉన్నామన్నదే ముఖ్యం..హౌస్ లో అందరితో కలిసిపోయాను, మంచిగా అందరికీ వంట చేసి పెట్టాను. ఇలా బయటకు వచ్చేసాను. ఇక నుంచి మంచి వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అని చెప్పింది. దాంతో నెటిజన్స్ కూడా ఆమె వీడియో మీద కామెంట్స్ చేస్తున్నారు. "అదొక వేస్ట్ షో సిస్టర్.... మీరు ఫస్ట్ వచ్చి మంచి పని చేశారు..మీకు ఆ షో అసలు వేస్ట్. వచ్చావా అక్క నువ్వు లేవని కృష్ణమ్మ బాధతో పొంగిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నంత చురుకు బిగ్ బాస్ లో లేకుండా పోయింది అక్క " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.