English | Telugu

నవ్యస్వామి జిమ్ బడ్డీస్ వీళ్లే! గుర్తుప‌ట్టారా?

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫిగర్ మెయింటైన్ చేసే టీవీ స్టార్లలో నవ్య స్వామి ఒకరు. తెలుగు ప్రజలకు 'ఆమె కథ' సీరియల్‌తో చేరువైన ఈ మైసూర్ ముద్దుగుమ్మ వయసు మూడు పదులు. అయితే, ఎప్పుడూ సన్నజాజిలా ఉంటుంది. ఫిట్‌నెస్ విషయంలో అసలు నిర్లక్ష్యం వహించదు. నవ్య స్వామి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంది. ఇంతకీ, జిమ్‌లో నవ్య స్వామి స్నేహితులు ఎవరో తెలుసా? ఫొటోలో వాళ్లను గుర్తు పట్టారా? ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, హీరోయిన్ నందిని రాయ్, ఇంకొకరు ఫిట్నెస్ ట్రైన‌ర్ బెన్నీ.

'మాయ', 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' సినిమాల్లో నటించిన నందిని రాయ్... 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు', 'మెట్రో కథలు', 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రజెంట్ 'కోతి కొమ్మచ్చి'లో ఐటమ్ సాంగ్ చేసింది.

'పిట్ట కథలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ రావు, రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారు. నవ్య స్వామి, నందిని రాయ్, సంజయ్ రావు జిమ్ బడ్డీస్ అంట. సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోస్ కబుర్లు చెప్పుకొంటూ జిమ్ చేస్తారన్నమాట.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...