English | Telugu
'నన్ను టాప్ 5లోకి తీసుకెళ్లకపోతే చంపేయ్'.. దేవుడికి మొర పెట్టుకున్న నటరాజ్
Updated : May 13, 2022
'బిగ్ బాస్ నాన్ స్టాప్' చివరి అంకానికి చేరుకుంది. దీంతో ఆట రసవత్తరంగా మారింది. హౌస్ లో వున్న ఇంటి సభ్యులు నువ్వా నేనా అనే స్థాయిలో ఒకరిని మించి ఒకరు మోసం చేసుకుంటూ టాప్ 5 కోసం నానా పాట్లు పడుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అఖిల్ - నటరాజ్ మాస్టర్ మధ్య చిచ్చు పెట్టింది. అఖిల్ అసలు రూపాన్ని నటరాజ్ మాస్టర్ కు మరోసారి చూపించింది. ఈ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ ఓడిపోవడంతో వింత వింతగా ప్రవర్తించాడు. 'బాద తట్టుకోలేకపోతున్నా.. ఈ హౌస్ లో ఎవరూ నాకు హెల్ప్ చేయరు. నన్ను చంపేయ్. కనీసం ఆడియన్స్ ఓట్లు అడుక్కునే అవకాశం కూడా లేకుండా చేశావ్. ఆ ఆవకాశం కూడా లాగేసుకున్నావే. ఇంకేమి చేస్తావ్. మెడపట్టి చంపెయ్..' అంటూ ఆకాశం వంక చూస్తూ వింత వింతగా అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించాడు.
అతని వింత ప్రవర్తన హౌస్ లో వున్న వాళ్లని షాక్ కు గురిచేసింది. బాబా భాస్కర్ వచ్చి 'ఏంట్రా నట్టా.. ఎవరితో మాట్లాడుతున్నావ్ రా నట్టా.. నీ గురించి తప్పుగా అనుకుంటార్రా..' అని చెప్తున్నా నటరాజ్ మాస్టర్ తగ్గలేదు.
"నన్ను టాప్ 5లో కి తీసుకుని వెళ్లకపోతే చంపెయ్.. నన్ను చంపెయ్.. నాకు సుఖం ఇచ్చింది ఎప్పుడు.. నాకు హౌస్ లో సపోర్ట్ రాదే. ఆడియన్స్ సపోర్ట్ కోసం పరుగు పెడుతున్నాను. నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. నా కూతురు మొహం చూసి ఆడుతున్నా అంతే.. నాకు హౌస్ లో శత్రువులు ఎక్కువే. నేను ఇలానే వుంటా. ఎన్ని సార్లు ఓడగొడతావో ఓడగొట్టు.. నేను పోరాడుతూనే వుంటాను. చిన్న పాపని వదిలేసి వచ్చి ఉన్నాను. 'నేను సాధించాను. టాప్ 5 లో వున్నాను. గెలిచాను.' అని గర్వంగా చెప్పడానికి ఇక్కడకు వచ్చాను.నాకు కోరిక లేదు.. నా కూతురు గురించే ఆడుతున్నాను. సగం చచ్చిపోయి వున్నాను. 23 ఏళ్లుగా ఆడుతున్నాను. అలిసిపోయాను." అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చేశాడు నటరాజ్ మాస్టర్.
ఇది గమనించిన అఖిల్ `మాస్టర్ ఇక ఆపుతారా?` అనడంతో `ప్లీజ్.. ప్లీజ్.. నాకు నీ సపోర్ట్ అవసరం లేదు. నేను దేవుడితో మాట్లాడుకుంటా. నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు` అంటూ అఖిల్ కి కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ కూడా మాస్టర్ కు దిమ్మదిరిగే కౌంటర్ వేశాడు. సక్సెస్ ఇలా అడిగితే రాదు అంటూ బ్రెయిన్ వాష్ చేశాడు.