English | Telugu
`ఇంటింటి గృహలక్ష్మి`: నందు, తులసీ ఉగ్రరూపం..
Updated : Jan 13, 2022
ఓ వైపు నందుకు జాబ్ వచ్చేసిందని ఇంట్లో వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతుంటే లాస్య నుంచి ఊమించని ప్రతిఘటన ఎదురౌతుంది. నందుని తన నుంచి దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారని ఊహించుకున్న లాస్య.. తులసిపై పగ సాధించాలని ప్లాన్ చేస్తుంది. సరైన అదను కోసం ఎదురుచూస్తున్న లాస్యకు ప్రేమ్ - శృతిల రూపంలో బ్రహ్మాస్త్రం లభిస్తుంది. అదేంటన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి కోట్లు సంపాదించేయడానికి తులసి పెద్ద కుమారుడు అభి నిర్ణయించుకుంటాడు. తన మిత్రుడికి ఫోన్ చేసి తానూ షేర్ మార్కెట్ లో డబ్బులు పెడతానని చెబుతాడు. అయితే షేర్ మార్కెట్ అనేది లక్ ని బట్టి వుంటుందని వస్తే ఒకేసారి కోట్లు వస్తాయి. లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. తీరా డబ్బులు పోతే తనని బాధ్యత కాదని అందులో ఉన్న రిస్క్ ని అభికి వివరిస్తాడు అతని మిత్రుడు. అయితే అబి మాత్రం చేతులు కాల్చుకోవడానికే రెడీ అవుతాడు.
Also Read: షణ్ముఖ్ జస్వంత్‌కు మళ్లీ షాక్.. తగ్గేదేలే అంటున్న దీప్తి!
కట్ చేస్తే... పెళ్లైనా కాపురం చేయడం లేదని వేరుగా వుంటున్నారని ఇంట్లో వాళ్లకి తెలిసిపోతుందని, ఆ తరువాత మన పరిస్థితి ఏంటని శృతి.. ప్రేమతో అంటుంది. అది లాస్య చెవిన పడుతుంది. `వీళ్లకి పెళ్లి అయినా కాపురం చేయడం లేదా? ఇన్నాళ్లూ ఎంత బిల్డప్ ఇచ్చారు? ఆ విషయం నేను బయటపెడతాను కదా నాకు బ్రహ్మాస్త్రం దొరికింది ఇక ఇద్దరిని ఉతికి ఆరేస్తాను? అని సంబరపడిపోతుంది లాస్య. శృతి అన్న మాటలు తులసి చెవిన పడితే ఏం జరిగింది? ... లాస్య మాటలకు నందు రియాక్షన్ ఏంటీ? ఎలాంటి ఉగ్ర రూపం దాల్చారు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.