English | Telugu
బిందు మాధవిని అడ్డంగా బుక్ చేసిన నాగార్జున
Updated : May 16, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ సన్ డే ఫన్ డే కాస్త హాట్ అండ్ హీట్ డేగా మారింది. ప్రతీ ఆదివారం సన్ డే ఫన్ డే అంటూ ఎంట్రీ ఇచ్చే నాగార్జున ఈ సండే హౌస్ ని హీటెక్కించాడు. కంటెస్టెంట్ లు ఈ వీక్ లో ఎలాంటి తప్పులు చేశారో ఎండ గడుతూ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సీజన్ ఓటీటీ ఫస్ట్ వెర్షన్ లో బిందు మాధవి, అఖిల్ ల మధ్య గత కొన్ని వారాలుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో బిందు, అఖిల్ ఒకరిని ఒకరు విలన్ లు గా చిత్రీకరించుకుంటూ నిత్యం గొడవలు పడుతూనే వున్నారు. ఇక అఖిల్ స్లాంగ్ ని కించపరుస్తూ `ఆడ` అంటూ ఓ రేంజ్ లో ఇబ్బంది పెట్టింది కూడా.
ఆడ అనే పదాన్ని జెండర్ విషయంలో అఖిల్ మీద బిందు మాధవి ప్రమోగించడం, దానికి అఖిల్ ఫీలవడంతో బిందు తెలివిగా ఆ టాపిక్ ని పక్కదారి పట్టించి ఎస్కేప్ అయింది. అంతే కాకుండా అందులో జెండర్ లేదు అంటూ బుకాయించింది కూడా. కానీ నాగ్ ఈ వారం అదే టాపిక్ ని పట్టుకుని పదకొండవ వారం నామినేషన్ లో బిందుని అడ్డంగా బుక్ చేశాడు. నటరాజ్ మాస్టర్, బిందు మాధవి హద్దులు దాటి గొడవకు దిగారు. ఆడపిల్ల అని నటరాజ్ అన్న పదాన్ని బిందు వెంటనే అఖిల్ ని ఈ టాపిక్ లోకి తీసుకొచ్చింది.
ఇక్కడే నాగ్ కు అడ్డంగా దొరికిపోయింది. ఇదే పాయింట్ ని పట్టుకుని నాగార్జున .. బిందుని ఇరుకున పెట్టేశాడు. అంతే కాకుండా ఒరేయ్ అన్న డైలాగ్ ని కూడా చూపించి మరి ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నావేంటీ అని గట్టిగానే క్లాస్ పీకాడు. నటరాజ్ మాస్టర్ విషయంలో ఆడ అంటే అమ్మాయి అంటావు. అఖిల్ విషయంలో ఆడ అంటే అమ్మాయి కాదంటారు. ఇందులో ఏదో ఒక స్టాండ్ తీసుకో అని చురకలంటించారు నాగార్జున.