English | Telugu
అమ్మకు బర్త్‌డే గిఫ్ట్‌గా బంగారు గాజులు ఇచ్చి, ఎమోషనల్ అయిన మోనాల్!
Updated : Jul 15, 2021
"మా అమ్మే నా ప్రపంచం" అని బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ మోనాల్ గజ్జర్ అంటోంది. నేడు ఆమె తల్లి పుట్టినరోజు. అందుకని, బుధవారం అర్ధరాత్రి బర్ట్‌డేను సెలబ్రేట్ చేసింది. అమ్మను తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని మోనాల్ గజ్జర్ చెప్పుకొచ్చింది. అంతే కాదు... ఆమెను ముద్దులతో, బహుమతులతో ముంచెత్తింది.
తల్లికి మోనాల్ గజ్జర్ బంగారు గాజులను బహుమతిగా ఇచ్చింది. "అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. తనను సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాను. ప్రతి మహిళ ఇష్టపడే వాటిని ఇచ్చాను. అమ్మ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ఫ్యామిలీకి నేను ఇలా చేయగలుగుతున్నందుకు భగవంతుడికి థాంక్స్ చెబుతున్నా" అని మోనాల్ పోస్ట్ చేసింది.
మోనాల్ మదర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ మీరూ చూడండి. కూతురు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూసి మొదట ఆశ్చర్యపడి, ఆ తర్వాత మురిసిపోతూ వాటిని చేతులకు వేసుకున్నారు మోనాల్ వాళ్లమ్మ. ఆ టైమ్‌లో మోనాల్ భావోద్వేగానికి గురవడం మనం చూడొచ్చు.
'బిగ్ బాస్'కి ముందు తెలుగులో మోనాల్ కెరీర్ కోజ్ అయ్యిందని చెప్పాలి. రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేసింది. ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో కో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తో 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే సినిమా చేస్తోంది. అలాగే గుజరాతీ సినిమా ఒకటి చేస్తోంది.