English | Telugu

అఖిల్ బెడ్ రూమ్‌లో మోనాల్ ఫోటో!

బిగ్ బాస్ షోతో అఖిల్, మోనాల్ ల జంటకు పాపులారిటీ వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుస్తుంటారు. రీసెంట్ గా మోనాల్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. "నువ్వే నా రాణి" అంటూ తెగ పొగిడేశాడు అఖిల్. ఇక అఖిల్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో టాప్ లో నిలిస్తే 'అఖిల్ నెంబర్ వన్' అంటూ అతడిపై ప్రేమ కురిపించింది మోనాల్.

తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌తో అఖిల్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ ఇంటర్వ్యూ అఖిల్ ఇంట్లో జరిగింది. ఈ క్రమంలో అతడు తన బెడ్ రూమ్ ని చూపించాడు. అప్పుడ‌క్క‌డ‌ మోనాల్ గజ్జర్ ఫోటో కనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ వెనుక ఆమె నిల్చొని ఉన్న సమయంలో తీసిన ఫోటో అది. ఈ ఇంటర్వ్యూలో అఖిల్ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.

మోనాల్ గురించి మాట్లాడుతూ.. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. మోనాల్ ను ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తుంటానని... అందుకే ఆమె ఫోటోని బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లు చెప్పారు. "నాకోసం ఎక్కువగా ఆలోచించేవాళ్లలో మోనాల్ ఒకరు.. అందుకే ఆమె నాకు అంత దగ్గరైంది." అని వెల్ల‌డించాడు అఖిల్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...