English | Telugu

కావాల‌ని చార్జింగ్ త‌క్కువ పెట్టుకుని లైవ్‌లోకి వ‌స్తున్న‌ మోనాల్!

బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి తెలిసిందే. తరచూ తన ఫాలోవర్లతో చాట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అఖిల్ తో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. ఈ ఇద్దరికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యనే అఖిల్ ఓ వారం రోజుల పాటు సోషల్ మీడియాకి దూరమైతే దానికి కారణం మోనాల్ అంటూ కామెంట్స్ వినిపించాయి.

కానీ అఖిల్ తను సోషల్ మీడియా నుండి కావాలనే బ్రేక్ తీసుకున్నట్లు వివరించాడు. ఇక మోనాల్ రీసెంట్ గానే హైదరాబాద్ లో ఇల్లు కొని ఇక్కడకు షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతం తన ఇంటికి సంబంధించిన పనులతో బిజీగా ఉంది. తాజాగా లైవ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ తెగ సందడి చేసింది. అయితే లైవ్ లోకి వచ్చిన కాసేపటికే తాను వెళ్లిపోతున్నానని మోనాల్ చెప్పింది.

తన బ్యాటరీ పది శాతానికి వచ్చిందని.. అభిమానులకు గుడ్ బై చెప్పింది. తాను లైవ్ లోకి వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతుందని మోనాల్ అనగా.. ఓ నెటిజన్ 'మరి అలా బ్యాటరీ అయిపోయే ముందు ఎందుకు లైవ్ లోకి వస్తున్నావ్' అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి మోనాల్ నవ్వుతూ.. 'అలా ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు లైవ్ లోకి వస్తే అదే రీజన్ చెప్పి త్వరగా లైవ్ లో నుండి వెళ్లిపోవచ్చు' అంటూ కౌంటర్ ఇచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...