English | Telugu

ఇల్లు కొని హైద‌రాబాదీ అయిన‌ మోనాల్!

హీరోయిన్‌గా తెలుగులో రెండు సినిమాలు చేసినా రాని క్రేజ్‌ను బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది గుజ‌రాతీ అమ్మాయి మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె అఖిల్, అభిజిత్‌లతో క్లోజ్‌గా ఉంటూ వార్తల్లో నిలిచేది. కొన్నాళ్లకు అభిజిత్‌తో గొడవలు, అఖిల్‌తో స్నేహం వంటి అంశాలతో మోనాల్ హాట్ టాపిక్ అయ్యేది. మొత్తానికి ఈ షోతో మోనాల్‌కి గ్లామర్ పరంగా క్రేజ్ ఏర్పడింది.

హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ వారికి టచ్‌లో ఉంటోంది. తరచూ తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

వరుస ఆఫర్లు రావడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చాలని భావించిందట మోనాల్. దీనికోసం హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ.. హైదరాబాద్ లో తనకొక ఇల్లు దొరికిందని.. సో.. ఇప్పుడు తను కూడా అఫీషియల్ గా హైదరాబాదీ అయినట్లు చెప్పుకొచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...