English | Telugu
బిగ్ బాస్ చేతిలో ఏమి లేదా.. అంతా గంగవ్వదేనా!
Updated : Oct 17, 2024
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ తర్వాత టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. ఎవరు చెయ్యని సీక్రెట్స్.. అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ నోటి దూలవల్ల బయటపడుతున్నాయి. అయితే బట్టలు పిండుకోవడం గురించి గంగవ్వ, నబీల్ , మణికంఠ మాట్లాడుకుంటు ఉంటారు. నేను అయితే ఒకటే చీర పిండుకుంటున్నా అరేసుకుంటున్నా అని గంగవ్వ అంటుంది.
అప్పుడే నేను కూడా అని మణికంఠ అనగానే.. నీకు బట్టలు రాలేదు కాబట్టి పిండుకుంటున్నావ్.. నిన్న ఫోన్ మాట్లాడంగా చూడలేదా అని గంగవ్వ అంటుంది. అంటే కంటెస్టెంట్ లు తన ఫ్యామిలీ వాళ్ళతో ఫోన్ మాట్లాడతారా అన్న డౌట్ అందరిలోను వస్తుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో నేను ఈ వారం హౌస్ నుండి వెళ్ళిపోకుంటే నీకు తులం బంగారం ఇస్తానని గంగవ్వతో మణికంఠ అంటాడు. నువ్వు తొమ్మిదో వారం వెళ్తావని గంగవ్వ అనగానే అందరు ఒక్కసారిగా నవ్వుతారు. నువ్వు అలా అనకు అవ్వ నేను ఉండాలని మొక్కుకో అని మణికంఠ అనగానే.. నాకు మల్లన్న దేవుడు సాయం అవుతాడని గంగవ్వ అంటుంది. నేను ఇక్కడ ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు అర్థ తులం బంగారం కొనిస్తానని గంగవ్వకి మణికంఠ ప్రామిస్ చేస్తాడు. ఈ లెక్కన గంగవ్వకి బిగ్ బాస్ తనకి డబ్బులు ఇస్తాడు. దాంతోపాటు మణికంఠ ఉంటే కూడ గంగవ్వకి బంగారం వస్తుందన్న మాట.
బిగ్ బాస్ హౌస్ లో ఈ సీన్ చూసిన ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు. అంటే ఎవరు ఉండాలి.. వెళ్ళాలనేది బిగ్ బాస్ ఇష్టం కాదన్న మాట.. గంగవ్వదేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ గత సీజన్ లో వచ్చినప్పటి కంటే.. ఇప్పుడు చాలా వరకు ఆటలో, మాటలో మార్పు వచ్చింది. దాంతోపాటు మంచి ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్-5 లో గంగవ్వ ఉండటమనేది గ్యారంటీ.