English | Telugu
రిషిని దేవదాసుని చేసిన వసుధార
Updated : May 31, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. గ తకొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మంగళవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్రలు రిషి గురించి ఆలోచిస్తూ వుంటారు. తనకి ఏమైందా అని భయపడుతూ వుంటారు. ఇంతలో ధరణి అక్కడికి వచ్చి 'చిన్న మామయ్య.. దేవయాని అత్తయ్య పిలుస్తున్నారు' అని చెబుతుంది. మరో వైపు రిషి కారులో వస్తూ జరిగిన విషయం గురించి తలచుకుని బాధపడుతూ ఉంటాడు.
మరో వైపు దేవయాని, రిషి విషయం గురించి జగతి, మహేంద్రలను నిలదీస్తూ 'ప్రేమ వుంటే సరిపోదు, బాధ్యత ఉండాలి' అంటుంది. ఇంతలో 'ఇప్పుడు జగతి అక్కయ్య మేము బాధపడుతుంటే మీకు సంతోషంగా వుందా?' అంటుంది. అప్పుడు దేవయాని 'నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాతే రిషి అదుపు తప్పిపోతున్నాడు' అని అనగా అప్పుడు జగతి.. దేవయానికి స్ట్రాంగ్ గా బుద్ది చెబుతుంది. ఇంతలోనే రిషి వస్తాడు. రిషిని ఎక్కడికి వెళ్లావని ఎంత మంది అడిగినా ఏమీ చెప్పకుండా లోపలికి వెళ్లిపోతాడు. మరో వైపు వసుధార జరిగిన విషయం గుర్తుచేసుకుని బాధపడుతూ వుంటుంది.
కట్ చేస్తే.. జగతి .. వసుధార దగ్గరికి వెళ్తుంది. 'నేను జగతి మేడమ్ లా రాలేదు. రిషీకి తల్లిలా వచ్చాను' అంటుంది. 'ఏం జరిగింది?' అని వసుని నిలదీస్తుంది.'రిషి గుండెను ముక్కలు చేశావు, దేవదాసుని చేశావ్ వసుధార' అంటూ నిట్టూరుస్తుంది జగతి. ఆ తరువాత ఏం జరిగింది? .. రిషి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? .. వసుధార ఎందుకు రిషి ప్రేమని రిజెక్ట్ చేసింది?.. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.