English | Telugu

హౌస్ లో బ్లాక్ హార్ట్, వైట్ హార్ట్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఆరోవారం కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరికి మెహబూబ్, సీత ఉన్నారు. ఇక కిర్రాక్ సీత ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చేసింది. తను ఎలిమినేషన్ అయి బయటకొస్తుంటే హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన సీత తన జర్నీ చూసుకొని ఎమోషనల్ అయ్యింది.

ఇక హౌస్ లో ముగ్గురికి వైట్ హార్ట్, ముగ్గురికి బ్లాక్ హార్ట్ ఇవ్వాలని నాగార్జున చెప్పాడు. దాంతో విష్ణుప్రియకి వైట్ హార్ట్ ఇచ్చింది. తను చాలా ఇన్నోసెంట్ అని.. గేమ్ అసలు అర్దం కాలేదని చెప్పింది. బయటకు వెళ్లాక జీవితంలో మీ మమ్మీని మర్చిపోయేంత పెద్ద లవ్ దొరకాలి.. నీకొచ్చే పార్టనర్.. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.. అందరినీ మర్చిపోతావు… ఇది కృష్ణుడు నీకోసం నాతో పలికిస్తున్న మాట అంటూ సీత చెప్పగానే విష్ణు ఏడ్చేసింది. ఇక తర్వాత రెండో హార్ట్ నా తమ్ముడు నబీల్ అంటూ చెప్పింది. చాలా బాగా ఆడతావు రైడర్ నువ్వు.. నాకు రియాల్టీ షోలో రియల్ పీపుల్ విన్ కావాలని ఉంది.. సో నిన్ను విన్నర్ గా చూడాలని ఉంది అంటూ సీత చెప్పడంతో నబీల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. మూడో హార్ట్ ఎవరూ ఊహించని విధంగా అవినాష్ కు ఇచ్చింది. రావడంతోనే హౌస్ లోకి ఏదో పాజిటివ్ ఎనర్జీ తీసుకోచ్చాడని..తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నానని తెలిపింది. ఐ లవ్ యూ అవి.. నువ్వు వచ్చి వారమే అయిన నువ్వు నాకు బాగా నచ్చావని చెప్పింది.

ఆ తర్వాత మూడు బ్లాక్ హార్ట్స్ లో మొదటిది నిఖిల్ కు ఇచ్చింది. నిఖిల్ పక్కా హజ్బెండ్ మెటీరియల్ అని.. కానీ ట్రాన్స్ పరెంట్ గా ఉండాలని తెలిపింది. ఎవరో నిన్ను రైట్ అనాలని అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు..నీకు నచ్చింది మాట్లాడు.. నీకు ఏది రైట్ అనిపించిందో అదే రైట్.. ఇది గుర్తుపెట్టుకో అంటూ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత రెండో హార్ట్ గౌతమ్ కు ఇచ్చింది. గౌతమ్ వచ్చిన జోష్ నచ్చిందని.. కానీ చిన్న చిన్న వాటికి హార్ట్ కావొద్దని.. సేఫ్ గా ఆడకు అంటూ సలహా ఇచ్చింది. ఆ తర్వాత మూడో బ్లాక్ హార్ట్ నయని పావనికి ఇచ్చింది. ఈ వారం నువ్వు వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అని నామినేట్ చేశావ్.. కానీ వచ్చిన వారానికే నాకంటే ఎక్కువ ఏడుస్తున్నావంటూ చెప్పుకొచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...