English | Telugu

నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. ఉద‌య్ కిర‌ణ్‌పై కౌశల్ ఎమోషనల్ పోస్ట్!

'చిత్రం' సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి హిట్టు మీద హిట్టు అందుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు ఉదయ్ కిరణ్. అతి తక్కువ సమయంలో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో స్టార్ స్టేటస్ అనుభవించిన ఉదయ్ కిరణ్ ప్రొఫెషనల్ గా ఇబ్బందులు ఎదుర్కోవడంతో 2014 జనవరి 5న ఉరేసుకొని చనిపోయాడు. ఆయన మరణాన్ని అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ కు సంబంధించిన పోస్ట్ లు పెడుతూ ఆయన్ను గుర్తుచేసుకుంటూ ఉంటారు.

ఇదిలా ఉండగా.. ఈరోజు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయన్ను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ కౌశల్.. ఉదయ్ కిరణ్ ను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ముందుగా ఉదయ్ కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కౌశల్.. నిన్ను మిస్ అవ్వని క్షణం ఉండదని చెప్పారు.

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని.. మనిద్దరం కలిసి ఉన్న రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటానని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఎనిమిది సినిమాలు ఉదయ్ కిరణ్‌తో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...