English | Telugu

షాకింగ్ : మోనిత‌కు అడ్డంగా దొరికిన డాక్ట‌ర్ బాబు

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ తాజాగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సౌంద‌ర్య‌, ఆనంద‌రావు తాటికొండ గ్రామంలోని ప్ర‌కృతి వైద్యాల‌యంలో చేర‌డంతో వారినే అనుస‌రిస్తూ వెళ్లిన మోనిత అదే గ్రామంలో వున్న ప్రియ‌మ‌ణిని వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ప్రియ‌మ‌ణి ఫొటో చూపిస్తూ త‌న కోసం ఆరా తీస్తుంటుంది.

1247వ ఎపిసోడ్ ఈ రోజు ప్ర‌సారం కాబోతోంది. మ‌రి ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. సౌంద‌ర్య‌, ఆనంద‌రావు వెళ్లిపోవ‌డంతో ఒంట‌రి వాళ్లం అయిపోయిన‌ట్లుగా వుంద‌ని, కుటుంబం ఇలా చిన్నాభిన్నంగా మారింద‌ని ఆదిత్య‌, శ్రావ్య బాధ‌ప‌డుతుంటారు. ఇదిలా వుంటే సౌంద‌ర్య‌ ప్ర‌కృతి వైద్య‌శాల‌లో ఒంట‌రిగా కూర్చుని మ‌హేష్ కి కాల్ చేసి అన్ని ఊర్లు తిరుగుతున్నావా బాబు` అంటుంది. వెతుకుతున్నాన‌మ్మా.. అన్నీ వెతుకుతున్నాను... ఈ సారి నాకు కాస్త పేమెంట్ పెంచండ‌మ్మా నాకు క‌ష్ట‌మ‌వుతోంది.. ఈ సారి ఇంటికి వ‌చ్చి డ‌బ్బులు తీసుకుంటాను అంటాడు మ‌హేష్‌. అయితే ఇప్పుడు మేము ఆ ఇంటిలో లేమ‌ని, ఆశ్ర‌మంలో జాయిన్ అయ్యామ‌ని చెబుతుంది సౌంద‌ర్య‌.

క‌ట్ చేస్తే .. హోట‌ల్ ఓన‌ర్ `బాబు పార్సిల్ క‌ట్టారా.. ఆ సైకిల్ మీద వెళ్లి పార్సిల్ ఇవ్వు` అంటాడు. దానికి వేడి వేడిగా క‌డ‌తాను సార్‌` అని స‌మాధానం చెబుతాడు కార్తీక్‌. ఇంత‌లో మోనిత లోప‌లికి వ‌స్తుంది. అప్ప‌టికి కార్తీక్ వంట చేసే ద‌గ్గ‌రికి వెళ‌తాడు. ఇంత‌లో మోనిత లోప‌లికి వ‌చ్చి కూర్చుంటుంది. అది గ‌మ‌నించిన ఓన‌ర్ `అరేయ్ అప్పిగా.. క‌ష్ట‌మ‌ర్ వ‌చ్చారు చూడే` అని అరుస్తాడు. నువ్వు జూనియ‌ర్ వి వెళ్లు అని అప్పిగాడు కార్తీక్ ని వెళ్ల‌మంటాడు.

కార్తీక్ వెళుతుంటే మోనిత‌ని గ‌మ‌నించిన అప్పిగాడు `సినిమా హీరోయిన్ లా వుందే` అని మ‌న‌సులో అనుకుని కార్తీక్ ని ఆపేసి త‌ను వెళ‌తాడు. ఇంత‌కీ వ‌చ్చింది ఎవ‌రని కార్తిక్ తొంగి చూస్తే మోనిత క‌నిపిస్తుంది. మోనిత కూడా కార్తీక్ ని చూడ‌టంతో త‌ను అడ్డంగా దొరికిపోతాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...