English | Telugu
Karthika Deepam2 : నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు.. చావు బ్రతుకుల్లో కార్తీక్!
Updated : Sep 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -146 లో... కార్తీక్ ని నరసింహా కత్తితో పొడిచాడని తెలియగానే.. అందరు హాస్పిటల్ కి వస్తారు. డాక్టర్ బయటకు వచ్చి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది బ్లడ్ చాలా పోయింది.. సేమ్ గ్రూప్ అయితే బ్లడ్ ఇవ్వండి అని డాక్టర్ చెప్తాడు. జ్యోత్స్న నీది కార్తీక్ ది సేమ్ గ్రూప్ కదా అని అనగానే.. నేను డ్రింక్ చేసి ఉన్నా.. ఆ విషయం తెలిస్తే, ఆ చెంప ఈ చెంప వాయిస్తారని జ్యోత్స్న అనుకొని మొన్నే.. మా ఫ్రెండ్ కి బ్లడ్ ఇచ్చానని చెప్తుంది.
ఆ తర్వాత నాది అదే బ్లడ్ నేను ఇస్తానని దీప అంటుంది. సరేనని అనగానే లోపలికి వెళ్లి బ్లడ్ ఇస్తుంది. మరొకవైపు అసలు నువ్వు ఏ బ్లడ్ ఇవ్వలేదు.. కదా ఎందుకు అబద్దం చెప్పావని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. అవును నేను డ్రింక్ చేసానని జ్యోత్స్న అంటుంది. నీలాంటి నష్టజాతకురాలిని చూడలేదు. ఈ ఇంటికి అసలు వారసురాలు కాదని నీకు తెలుసు.. అసలు వారసురాలు బ్రతికే ఉందని తెలుసు.. ఇక రెండు రోజుల్లో పెళ్లి ఎలా జరిగుతుంది. బ్లడ్ నువ్వు ఇచ్చి ఉంటే సింపథీ ఉండేది. ఇప్పుడు బ్లడ్ ఇచ్చి దీప దేవత అయిందని జ్యోత్స్నని పారిజాతం తిడుతుంది. ఆ తర్వాత కాంచన దీపకి థాంక్స్ చెప్తుంది. ఎందుకు థాంక్స్ చెప్తున్నావ్.. అసలు దీనికి కారణం ఆ దీప అని శ్రీధర్ అంటాడు. అసలు ఈవిడ గనుక లేకుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా.. ఎవరు ఈ దీప, నరసింహా అని శ్రీధర్ అంటాడు.
శ్రీధర్ అన్న మాటలకి దీప ఏడుస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు దీప అని సుమిత్ర పంపిస్తుంది. దీప ఇంటికి వెళ్లి అనసూయకి జరిగింది చెప్తుంది. అప్పుడే శౌర్య కూడా వింటుంది. ఏమైంది కార్తీక్ కి అని శౌర్య ఏడుస్తుంది. నేను కార్తీక్ ని చూడాలంటూ శౌర్య ఏడుస్తుంటే.. ఇక దీన్ని ఆపలేమంటు శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్ కి వెళ్తుంది. దాని గురించి అసలు నిజం నీకు తెలియదని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.