English | Telugu
Karthika Deepam2 : ఆస్తిపై కన్నేసిన జ్యోత్స్న.. పారిజాతానికి చెమటలు పట్టించిన దాస్!
Updated : Sep 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -141 లో .. పారిజాతం జ్యోత్సని లోపలికి పంపిస్తుంది. ఈ నిజం నాకు మాత్రమే తెలుసు.. నీకెలా తెలుసని పారిజాతం జ్యోత్స్నని అడుగుతుంది. నువ్వు అదంతా చెయ్యడం.. నేను చూసానని దాస్ అంటాడు. సుమిత్ర వదిన బిడ్డని మార్చడం చంపమని సైదులుకి ఇవ్వడం వాడు సాక్ష్యం లేకుండా వాడిని చంపించిడం అంత నా ముందే జరిగింది. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా.. సుమిత్ర వదిన కూతురిని సైదులు చంపలేదు బస్టాండ్ లో వదిలేస్తే ఒకతను తీసుకొని వెళ్ళాడు. ఆ బిడ్డ బ్రతికే ఉందని దాస్ చెప్పగానే.. పారిజాతానికి చెమటలు పడుతాయి.
దాస్ ఈ విషయం ఇక్కడితో మర్చిపోరా అని పారిజాతం అంటుంది. నేను మర్చిపోను మొదలు పెట్టింది ముగించడానికి కాదు.. ఇన్ని కోట్లకి ఏకైక వారసురాలు ఆ బిడ్డ ఎక్కడ ఉందో కనిపెడతాను. తనతో నిజం చెప్తానని దాస్ అంటాడు. దాంతో పారిజాతం ఇంకా టెన్షన్ పడుతుంది. వాడు అసలైన వారసురాలిని పట్టుకొని నిజం చెప్పేకంటే ముందు నేను రెండు పనులు చెయ్యాలి. ఒకటి కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి.. రెండోది దీపని ఇంట్లో నుండి వెళ్లగొట్టడమని పారిజాతం అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ కి స్వప్న ఫోన్ చేసి మాట్లాడాలని అంటుంది. నేను దీపని తీసుకొని వస్తానని కార్తీక్ కి స్వప్న చెప్తుంది. ఇప్పుడు దీప ఎందుకని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నువ్వు అప్పుడు రెస్టారెంట్ లో కొట్టినప్పుడు నాపై ఎందుకు కోప్పడ్డావో.. కాశీని తిడితే నన్ను ఎందుకు తిట్టావో అర్ధం అయింది. దాస్ నా నాన్న కాశీ నా తమ్ముడు అని జ్యోత్స్న అంటుంది. కానీ నాకు వాళ్ళ లాంటి జీవితం వద్దు. నాకు ఇలాగే కావాలి. నేను ఈ ఆస్తిని వదులుకోలేను.. ఈ నిజం ఎవరికి తెలియద్దు అసలైన వారసురాలు బ్రతికే ఉందని అంటున్నారంటే తనకి నిజం తెలిసే లోపు.. నాకు కార్తీక్ భార్యగా స్థానం మాత్రం ఉంటుంది. లేకపోతే పనిమనిషి కూతురుగా మిగిలి పోతానని జ్యోత్స్న అంటుంది. నువ్వు సెటిల్ అయ్యాక.. మీ నాన్న కాశీలకు కొంచెం సెటిల్ చెయ్ అనగానే.. నో ఇప్పుడు వాళ్ళు ఏదో నా పేరెంట్స్ అని లేని ప్రేమని చూపించలేను. నువ్వు నాకు ఇలాంటి జీవితం ఇచ్చావ్ కాబట్టి నీ కోసం ఇస్తానని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న ఇల్లంతా చూసుకుంటూ వచ్చి హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే సుమిత్ర జ్యూస్ తీసుకొని వస్తుంది. నేను మీ కూతురుని కాదని తెలిస్తే ఈ ప్రేమ ఉంటుందా అనుకుంటుంది. ఆ తర్వాత దశరథ్ ఈ కార్ నచ్చిందా అంటూ అడుగుతాడు. బాగుందని జ్యోత్స్న అంటుంది అయితే ఆర్డర్ పెడతానని అంటాడు. నేను మీ కూతురు కాదని తెలిస్తే కారు కూడా ఎక్కనివ్వరు.. నాకు ఈ ఆస్తి, బావ ఇంకా మీరు కూడా నాకు పేరెంట్స్గా కావాలని జ్యోత్స్న స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏది ఏమైనా కూడా ఈ ఆస్థికి నేనే వారసురాలని జ్యోత్స్న అనుకుంటు వస్తుండగా.. వెనకాల వస్తున్న దీపకి డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.