English | Telugu

దీప‌కు అడ్డంగా దొరికిపోయిన డాక్ట‌ర్ బాబు

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా టాప్ రేటింగ్ తో కొన‌సాగుతున్న ఈ సీరియ‌ల్ సాగుతున్నా కొద్దీ మ‌రీ పేల‌వంగా మారుతోంది. ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర సీరియ‌ల్ పై వున్న క్రేజ్ ని వాడుకోవాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. దీనికి ఈ సీరియ‌ల్ రేటింగే నిద‌ర్శ‌నం. 18 రేటింగ్ తో టాప్ లో నిలిచిన ఈ సీరియ‌ల్ గ‌డుస్తున్నా కొద్దీ 13 కి ప‌డిపోయింది. దీంతో ప్రేక్ష‌కుల్లో ఈ సీరియ‌ల్ పై ఆస‌క్తి త‌గ్గుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఈ బుధ‌వారం 1259వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్ హోట‌ల్లో టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే దీప బాబుని వీపుకు క‌ట్టుకుని హోట‌ల్ వైపు వ‌స్తుంది. హోట‌ల్ ముందుకు వ‌చ్చేస‌రికి బొంబాయ్ భ‌ద్రం (హోట‌ల్ ఓన‌ర్‌) పార్సిల్ తీసుకుని ఎక్క‌డికో వెళ్ల‌బోతూ దీప‌ని చూసి ప‌ల‌క‌రిస్తాడు. మీకెందుకు శ్ర‌మ నేనే పార్సిల్ ఇచ్చేసి వ‌స్తాను అంటుంది. కానీ బొంబాయ్ భ‌ద్రం నువ్వు కౌంట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ల‌మ్మా నేను ఇచ్చేసి వ‌స్తాను అంటాడు. అన‌గానే దీప లోప‌లికి వెళుతుంది.

టేబుల్స్ క్లీన్ చేస్తున్న కార్తీక్ ని వెన‌క వైపు నుంచి చూసి అనుమానంతో తొంగి చూస్తుంది. కార్తిక్ అని తెలియ‌గానే దీప షాక్ కు గుర‌వుతుంది. కానీ కార్తీక్ తన‌ని ఎవ‌రూ చూడ‌టం లేద‌ని త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంటాడు. `ఏమండీ` అని దీప గ‌ట్టిగా ఏడుస్తూ అరుస్తుంది. దీప‌ని చూసి ఒక్క‌సారిగా షాక్ అవుతాడు కార్తీక్‌. దీప ఆవేశంగా వ‌చ్చి కార్తీక్ కాల‌ర్ ప‌ట్టుకుని ఏంటండీ? ఏం చేస్తున్నారు మీరు అంటూ కార్తీక్ ని వెన‌క్కి తోసేస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. కార్తీక్ ఎలా రియాక్ట్ అయ్యాడు? దీప ఎలాంటి నిర్ణయం తీసుకుంద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...