English | Telugu
డాక్టర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్
Updated : Mar 16, 2022
మొత్తానికి `కార్తీక దీపం` రూపు రేఖలు మారిపోతున్నాయి. దీప, డాక్టర్ బాబు, మోనితల పాత్రలకు డైరెక్టర్ ఎండ్ కార్డ్ వేసేశాడు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీరియల్ నుంచి వెళ్లిపోయిన దీప, డాక్టర్ బాబు, మోనిత మళ్లీ కొత్త సీరియల్ లో కనిపిస్తారా? .. అది ఎప్పుడు మొదలవుతుంది? ... డాక్టర్ బాబు - మోనిత ఇద్దరు కలిసి చేస్తారా? లేక డాక్టర్ బాబు, దీప కలిసి చేస్తారా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తూ డాక్టర్ బాబు, మోనిత రొమాంటిక్ ట్రీట్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
`కార్తీక దీపం` సీరియల్ లో వీరిద్దరి మధ్య ఎలాంటి సరదా సన్నివేశాలు కానీ , రొమాంటిక్ సీన్ లు కానీ లేవు. అయితే ఆ లోటుని తీర్చేందుకు ఓ రొమాంటిక్ సాంగ్ తో ఈ ఇద్దరు రచ్చ చేశారు. `స్టార్ మా` లో ప్రసారం కానున్న స్పెషల్ ఈవెంట్ కోసం డాక్టర్ బాబు, మోనిత కలిసి రొమాంటిక్ సాంగ్ లకు డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటోంది. `స్టార్ మా లో `కలర్స్ ఆఫ్ రొమాన్స్.. తగ్గేదేలే` అంటూ ప్రత్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. ఇందులో డాక్టర్ బాబు, మోనిత రొమాన్స్ చేస్తూ రొమాంటిక్ పాటలకు స్టెప్పులేయడం ఆకట్టుకుంటోంది.
డాక్టర్ బాబు మోనితని ఎత్తుకుని కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ అలా ఉండిపోవడంతో.. 'జానకి కలగనలేదు' ఫేమ్ అమర్ దీప్ ఈ జంటపై అదిరిపోయే సెటైర్ వేశాడు. "ఆ కంఫర్ట్ లెవెల్.." అంటూ కామెంట్ చేశాడు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న యాంకర్ రవి మరింతగా రెచ్చిపోయి డాక్టర్ బాబు.. మోనితపై ఎక్కడ చేయి వేశాడో .. నడుముపై ఏ విధంగా పట్టుకున్నాడో.. అంటూ వర్ణించడం మొదలు పెట్టాడు. తాజాగా విడుదలైన ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో `కార్తీక దీపం` లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 20న రాత్రి 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.