English | Telugu

రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ రేటింగ్ ప‌రంగానూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ శుక్ర‌వారం 1249వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. త‌న‌ పిల్ల‌ల జోలికి రావ‌ద్దంటూ రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. "నేను మీలాగే మీకంటే ఎక్కువే క‌ళ్లు ఉరిమి చూస్తూ పెద్ద‌గా అరుస్తూ అదే విష‌యాన్ని చెప్ప‌గ‌ల‌ను. కానీ మీకు నాకు తేడా వుంది క‌దా.. స‌రే కానీ ఈ కూర రుచి చూడండి" అంటూ రుద్రాణి ద‌గ్గ‌రికి గ‌రిటె తీసుకుని వెళుతుంది దీప‌.

Also read:రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది?

"కూర‌లో కారం త‌గ్గింది దీపా.. నేను కారం ఎక్కువ తింటాను లే.. నువ్వు కూర‌ల్లో కారం పెంచు దీపా.. పిల్ల‌లకు కాస్త పౌరుషం, రోషం పెరుగుద్ది.. నాద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి అవి ఎక్కువ‌గా వుండాలిగా అందుకే రుచి చూశాను." అంటుంది రుద్రాణి. "ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా రుద్రాణి గారూ.." అంటుంది దీప‌. "నువ్వు చెప్పేది నువ్వు చెప్పావ్‌.. నేను చేసేది నేను చేస్తాను మీకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి.. అదే అప్పు తీర్చే రోజులు.. చూద్దాం. అప్పు తీరుస్తారో.. లేక పిల్ల‌ల్ని.." అంటుంది రుద్రాణి.

Also read:షాకింగ్ : మోనిత‌కు అడ్డంగా దొరికిన డాక్ట‌ర్ బాబు

"అంత దాకా రానివ్వ‌ను లెండి రుద్రాణి గారు. నా పిల్ల‌ల జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోను" అంటూ క్యారేజ్ స‌ద్దుకుని వెళ్లిపోతుంది. "ఏంట్రా ఇది.. ఏంటి దాని ధైర్యం.. ఈ అవ‌మానం నాకు గుర్తుండాలంటే ఆ వంట గ‌దిని మూసేయండి"అంటూ ప‌ని వాళ్ల‌కు చెబుతుంది రుద్రాణి. ఇంత‌కీ దీప ధైర్యం ఏంటీ? . రుద్రాణి త‌రువాత ఏం చేసింది?.. కార్తీక్ ఏం ఆలోచిస్తున్నాడు?.. మోనిత ఇంకా తాటికొండ‌లోనే వుందా? అన్న‌ది చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...