English | Telugu

Karthika Deepam2 : ఇంటి వారసురాలు దీప చేతుల మీదుగా హోమం.. అందరు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -521 లో.. కావేరిని జ్యోత్స్న అవమానిస్తుంది. అదంతా కార్తీక్ కి తెలిసి జ్యోత్స్నతో కావేరికి క్షమాపణ చెప్పిస్తాడు. కావేరి కాళ్ళకి పసుపు రాయమని జ్యోత్స్నకి సుమిత్ర చెప్పగానే.. జ్యోత్స్న చేసేదేమీ లేక కావేరి కాళ్ళకి పసుపు రాస్తుంది. దాంతో జ్యోత్స్న కోపంతో ఉంటుంది. అందరికి రాయి అని సుమిత్ర అంటుంది. నేను రాస్తానని దీప అంటుంది. కాంచనకి సుమిత్రకి దీప పసుపు రాస్తుంది దీప. అదంతా కార్తీక్ చూస్తాడు. దీపని చూసి నవ్వుతాడు.

మరొకవైపు కాంచనతో శివన్నారాయణ మాట్లాడతాడు. నువ్వు నీ భర్తని క్షమించు అమ్మ అని అడుగుతాడు. అది జరగదని కాంచన అంటుంది. అదంతా శ్రీధర్ ఒకవైపు, మరొకవైపు కార్తీక్ వింటుంటారు. నా కోసం క్షమించొచ్చు కదా అని శివన్నారాయణ అనగానే.. మీ కోసం క్షమిస్తాను కానీ భర్తగా తనని దగ్గరికి తీసుకోలేను. కానీ అతన్ని ఎప్పుడు క్షమిస్తానో తెలుసా అని కాంచన ఏదో చెప్పబోతుంటే అప్పుడే దాస్ వస్తాడు. దాంతో కాంచన ఆగిపోతుంది. దాస్ లేట్ గా వస్తే కాంచన మనసులో ఏముందో తెలిసేదని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత అందరు దాస్ తో మాట్లాడతారు. దాస్ ని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పుడే పంతులు వచ్చి హోమం మొదలు పెడతాడు. హోమం అయ్యాక ఈ పూర్ణహుతి హోమంలో ఈ ఇంటివారసురాలు వెయ్యాలి కింద పడేస్తే అరిష్టమని పంతులు చెప్తాడు. హోమం చుట్టూ సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న తిరుగుతారు. మరొకవైపు అసలైన వారసురాలు వెయ్యాలి కదా మరి జ్యోత్స్న వేస్తుంది ఆపాలని దాస్ అనుకుంటాడు. దాంతో పారిజాతం అతన్ని ఆపుతుంది.

సుమిత్రకి కళ్ళు తిరుగుతుంటే సుమిత్రని పట్టుకొని దీప తిరుగుతుంది. నేను చెయ్యలేని పని దేవుడు చేసాడని దాస్ అనుకుంటాడు. హోమంలో పూర్ణహుతి వేస్తున్నప్పుడు అది దీప చేతులమీదుగా అందులో పడుతుంది. అందరు షాక్ అవుతారు. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతో ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.