English | Telugu
Karthika Deepam2 : శివన్నారాయణ ఇంట్లో హోమం.. దీపకి గుడ్ న్యూస్!
Updated : Nov 20, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -519 లో.....శ్రీధర్ ఇంటికి పారిజాతం వెళ్లి వాళ్లని హోమానికి ఆహ్వానిస్తుంది. మేమ్ రాము అని శ్రీధర్ చెప్తాడు. అల్లుడు నేను అన్నమాటలన్నీ మనసులో పెట్టుకోకని పారిజాతం అంటుంది. పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో.. వస్తాను కానీ నా భార్య వస్తేనే వస్తానని శ్రీధర్ అంటాడు. కావేరి నువ్వు నా కూతురులాంటి దానివిరా.. అమ్మ హోమానికి అని పిలుస్తుంది.
మీరు ఫోన్ చేసిన కూడా మేమ్ వచ్చేవాళ్ళం కానీ మీరు మా అయనని బాధపెట్టారని కావేరీ అంటుంది. ప్లీజ్ అవన్నీ మనసులో పెట్టుకోకండి అని పారిజాతం రిక్వెస్ట్ చెయ్యడంతో కావేరి కూడా సరే అంటుంది. స్వప్న, కాశీ మీరు కూడా రండి అని పారిజాతం చెప్తుంది. కాసేపటికి అక్కడ నుండి అందరు బయల్దేరతారు. ఇంటికి వెళ్ళాక పారిజాతాన్ని లోపలికి పంపించి జ్యోత్స్నతో కార్తీక్ మాట్లాడతాడు. అదంతా దూరం నుండి పారిజాతం వింటుంది. అప్పుడే శివన్నారాయణ వచ్చి.. రేయ్ కార్తీక్ అక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నారు. పారిజాతాన్ని మధ్యలో పెట్టి మాట్లాడుకోండి.. తను మీరు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడక ఇబ్బంది పడుతుందని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు.
ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న మాట్లాడుకుంటారు. విపత్తు అనేది వీళ్ళ కుటుంబానికి.. మనకి కాదు మంచి అనేది ఈ ఇంటికి వారసురాలికి.. నాకు కాదు.. ఆ దీపకి అంటూ ఆగిపోతుంది. ఏంటే అసలైన వారసురాలు ఎవరో తెలుసా అని పారిజాతం అడుగుతుంది. అదేం లేదని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ హోమంతో మనకేం పనిలేదని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ ఇంటికి వెళ్లి కాంచనకి హోమం గురించి చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ నిద్రపోతుంటే కలలో తన భార్య కన్పిస్తుంది.. అలాగే కాంచనకి కూడా కన్పించి నేను వస్తున్నానని చెప్తుంది. దాంతో కాంచన ఒక్కసారిగా లేచి భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.