English | Telugu

Karthika Deepam2 : కొడుకు పెళ్ళితో తండ్రి బంఢారం బయటపడనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -151 లో... కార్తీక్ కి దీప టాబ్లెట్ తీసుకొని వచ్చి వేసుకోమని అంటుంది. తర్వాత వేసుకుంటాలే అని కార్తీక్ అనగానే మీరు శౌర్య లాగే చేస్తున్నారని దీప అంటుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి శౌర్యకి వేసినట్లు నోట్లో వెయ్ దగ్గర ఉండి చూసుకుంటానని అంటే మరి ఇంత దగ్గర ఉండి చూసుకుంటావనుకోలేదు దగ్గర ఉండాల్సిన వాళ్ళని దూరం పెడుతున్నావ్.. దూరం ఉండాల్సిన వాళ్ళని దగ్గర ఉండమంటున్నావ్ అని జ్యోత్స్న అనడంతో ఇద్దరు కోపంగా చూస్తారు.

జరిగిన వాటికి అన్నిటికి నేనే బాధ్యత వహిస్తాను.. ఎందుకంటే మీ ఎంగేజ్ మెంట్, పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అని దీప అంటుంది. నీ భర్త కారణంగానే మా బావ ఈ సిచువేషన్ లో ఉన్నాడు. అసలు అయితే రాత్రికి రాత్రే వెళ్లిపోవాలి నువ్వు.. అలా చెయ్యలేదంటూ దీప బాధపడేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న మాటలు భరించలేక దీప బయటకు వస్తుంది. ఆ మాటలన్నీ విన్నాను.. శౌర్య ఎలాగో జ్యోత్స్న అలాగా.. దాని మాటలు పట్టించుకోకని కాంచన అంటుంది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి అని దీప చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు కాశీ ఇంటికి శ్రీధర్ వస్తాడు. అప్పుడే పారిజాతం ఆ ఇంటి నుండి బయటకు రావడం శ్రీధర్ చూసి ఆగిపోతాడు. అత్తయ్య ఇక్కడ ఉందేంటని శ్రీధర్ అనుకుంటాడు.‌ అప్పుడే దాస్ కూడా వస్తాడు. పారిజాతాన్ని కాశీ నానమ్మ అని పిలవడం దాస్ ని నాన్న అని పిలవడం విని షాక్ అవుతాడు‌. అంటే దాస్ కొడుకే కాశీ.. ఈ పెళ్లి జరిగితే నా రెండో పెళ్లి విషయం బయటపడుతుందంటూ కంగారుగా వెనక్కి వెళ్తాడు.బఆ తర్వాత జ్యోత్స్న అన్న మాటలు కార్తిక్ గుర్తుచేసుకుంటుంటాడు. అప్పుడే స్వప్న ఫోన్ చేసి నాన్న పెళ్లికి ఒప్పుకున్నాడు. కాశీ తో మాట్లాడడానికి వెళ్లాడని స్వప్న చెప్పగానే.. కార్తీక్ షాక్ అవుతాడు అక్కడికి నాన్న వెళ్తే నిజం తెలుస్తుంది కదా అని కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే కాంచన వస్తుంది. ఏమైంది టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఫోన్ లో స్వప్న అంటున్నావ్ తనేనా అని అడుగుతుంది. అవునని కార్తిక్ అంటాడు.

ఆ తర్వాత మీ నాన్న మారిపోయారు.. కొడుకుకి ఇలా జరిగినప్పుడు పక్కన ఉండాలి కానీ ఇలా చేస్తున్నాడని కాంచన అంటుంది. తన టెన్షన్ లు తనకి ఉంటాయి కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న జ్యూస్ చేసుకొని రమ్మని అంటే బత్తాయి కాయ పట్టుకొని వచ్చి ఇదంతా రిస్క్ ఎందుకు అని ఆర్డర్ పెట్టానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత శివన్నారాయణ ఇంట్లో లేడని.. శౌర్య, అనసూయలని పారిజాతం తిడుతుంది. అప్పుడే దీప వస్తుంది. తనని చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...