English | Telugu

యాంకర్ సుమ సీక్రెట్ చెప్పేసిన జోగీ బ్రదర్స్

బుల్లితెరపై యాంకర్ గా సుమకున్న ట్రాక్ రికార్డ్ అందరికి తెలిసిందే. అయితే అమె పంచ్ ల వెనకున్న అసలు సీక్రెట్ ఒకటి వుందట. ఆ విషయాన్ని జోగీ బ్రదర్స్ తాజాగా బయట పెట్టేసి షాకిచ్చారు. ప్రతీ శనివారం ఈటీవీలో సుమ యాంకర్ గా నిర్వహిస్తున్న `క్యాష్ .. దొరికినంత దోచుకో` బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతీ వారం ఈ షోలో సెలబ్రిటీలని, టీవీ నటుల్ని యాంకర్ సుమ ఆహ్వానిస్తూ వారితో కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో నలుగురు గెస్ట్ లని తన షోకి ఆహ్వానించింది.

జూన్ 4న శని వారం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కి నటి రాగిణి, కాదంబరి కిరణ్, జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ షోలో జోగీ బ్రదర్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. డీజే టిల్లు పాటకు కృష్ఱంరాజు స్టెప్పులేస్తే ఆ స్టెప్పులపై సుమ `ఇన్నేళ్లైనా కూడా అవే స్టెప్పులు ఏమీ మారలేదు అంటూ అదిరే పంచ్ వేసింది. దీనికి `నువ్వు యాంకరింగ్ ఏమైనా మార్చావేంటీ? అంటూ కృష్ఱంరాజు కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ కృష్ణంరాజు, జోగి నాయుడు ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుంటే ఎవరికి ఆ ముద్దులు.. రాత్రి 9:30 షో ఇది.. ఫ్యామిలీ షో ఇది అని పంచ్ విసిరింది సుమ‌.

దీనికి జోగినాయుడు `అయితే మా ఫ్యామిలీస్ ని ఎందుకు పిలవలేదు అంటూ కౌంటరిచ్చాడు. ఆ తరువాత జోగీ బ్రదర్స్ ఇద్దరు కూర్చుని సుమపై కౌంటర్లు వేయడం మొదలు పెట్టారు. అన్నయ్యా సుమ తెలుసుకదా అని జోగి నాయుడు అంటే `నాకెందుకు తెలియదురా నేను చిన్నప్పుడు సుమ యాంకరింగ్ చూసేవాడిని అంటూ కృష్ణంరాజు స్ట్రాంగ్ పంచ్ వేశాడు. దీంతో సుమ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది. ఆ వెంటనే జోగి నాయుడు అందుకుని `సుమ అనుకుని పంచ్ వేస్తదంటవా లేక స్పాంటెనియస్ గా వేస్తదంటవా? అని అడిగాడు. `పడుకోదూ.. రాత్రి అంతా పంచ్ లు ప్రాక్టీస్ చేసి పొద్దున్నే వేసేస్తది` అని కృష్ణంరాజు పంచ్ వేశాడు. ఈ పంచ్ కి సుమతో సహా కాదంబరి, రాగిణి పగలబడి నవ్వేశారు. జూన్ 4న శనివారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `క్యాష్` ప్రోగ్రామ్ తాజా ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సందడి చేస్తోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...