English | Telugu

Jayam serial : రుద్ర ప్రతాప్ భార్య గంగ  ఎంట్రీ.. ‌షాకిచ్చిన‌ పారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -118 లో......గంగని రుద్ర పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలుస్తుంది. ఒక్క పెద్దసారు తప్ప అందరు షాక్ లో ఉంటారు. గంగ మీడియాతో మాట్లాడడం పెళ్లి మండపంలో అందరు చూస్తారు. మీరు రుద్ర సర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారట డైరెక్ట్ ఇక్కడేకే తీసుకొని వచ్చారట సర్ గ్రేట్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ఛాంపియన్ ని చేసాడని మీడియా వాళ్ళు గంగతో అంటారు. ఈ విజయం రుద్ర సర్ ది అని గంగ మీడియా వాళ్ళకి చెప్తుంది. అదంతా టీవీలో అందరు చూస్తారు.

ఇప్పుడు అర్థం అయింది ఇదంతా గంగ నువ్వు ప్లాన్ ప్రకారం నన్ను ఫూల్ ని చెసారు అని రుద్రపై పారు కోప్పడుతుంది. అప్పుడే గంగ ట్రోఫీ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ రుద్రని ట్రోఫీని నేనే గెలుచుకున్నానని చెప్పడానికి వచ్చావా అని గంగతో పారు అంటుంది. ఈ అనార్ధం జరగకుండా ఉండాలనే నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసాం.. అయినా జరిగిందని ఇషిక అంటుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని గంగతో వీరు అంటాడు. అది చెప్పడానికి మీరు ఎవరు.. నేను రుద్ర ప్రతాప్ భార్యని విజయేంద్ర ప్రతాప్ కోడలిని అని గంగ అనగానే అందరు షాక్ అవుతారు.

ఆ తర్వాత విన్నారా ఇదంతా వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు కానీ నేనే అర్ధం చేసుకోలేదు. ఇక ఇంత జరిగాక నేను ఉండను.. ఇలా జరుగుతుందని ముందే తెలుసని పారు తన దగ్గరున్న పాయిజన్ తాగుతుంది. తరువాయి భాగంలో గంగ వల్లే పారు ఆత్మహత్యాయత్నం చేసిందని పారు అన్న హరి కంప్లైంట్ ఇవ్వడం తో గంగని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.