English | Telugu
యష్ - వేదల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ మొదలైందా?
Updated : May 30, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. స్టార్ ప్లస్ ఛానల్ లో ఏడేళ్ల క్రితం పాపులర్ సీరియల్ గా మహిళా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న `యే హై మొహబ్బతే`కు రీమేక్ గా ఈ సీరియల్ ని తెలుగులో రూపొందించారు. కన్నడ నటుడు నిరంజన్, కోల్ కతా నటి డెబ్జానీ మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. కీలక పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, సుమిత్ర, తిరుపతి దోర్య నటించారు. గత కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళల్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
స్కూల్ లో ప్రత్యేకంగా నిర్వహించిన స్కూల్ డే కోసం వెళ్లిన వేద, ఖుషీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తనని స్టాప్ ముందు వరుసలోకి వెళ్లకుండా చేయడంతో వెనకాలే వుండి ఖుషీ స్పీచ్ ని ఎంజాయ్ చేసిన యష్ ఆ తరువాత మిక్కీ మౌస్ లో ఖుషీని సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ వ్యక్తిని మిక్కీ మౌస్ గెటప్ లో స్కూల్ కి రప్పిస్తాడు. అయితే అప్పటికే స్కూల్ లో ప్రోగ్రామ్ పూర్తయిపోవడంతో ఖుషీ, వేద కలిసి ఇంటికి వెళ్లిపోతారు. అది తెలిసి యష్ ఫీలవుతాడు. మిక్కీ మౌస్ గెటప్ లో వచ్చిన వ్యక్తిని నీ వల్లే ఇదంతా జరిగింది అంటూ నిందిస్తాడు.
అయితే మిక్కీ మౌస్ గెటప్ లో వచ్చింది తన బద్ద శత్రువు అభిమన్యు అని తెలియడంతో షాకవుతాడు. ఇలాంటి పనులు కూడా చేస్తావా? అంటూ అభిమన్యుపై ఫైర్ అవుతాడు యష్.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు యష్. ఖుషీని ఇంట్లోకి పంపించేసి కార్ పార్క్ చేస్తూ వేద కనిపిస్తుంది. తన కోసం వేచి చూడకుండా వెంటనే ఇంటికి ఎందుకు వచ్చేశావని, తన ఖుషీ ముందు తనని బ్యాడ్ చేయాలని ఇదంతా చేశావని యష్ .. వేదని నిలదీస్తాడు. ఈలోగా వర్షం మొదలవుతుంది. బాల్కనీ విండోలోంచి ఖుషీ చూస్తున్నది గమనించిన యష్ వర్షంలో తడిసి ముద్దవుతున్న వేదని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పేస్తాడు. దీంతో వేద షాక్ అవుతుంది.
వెంటనే యష్ ని దూరంగా నెట్టేస్తుంది. ఇదంతా నీపై మోహంతో చేయలేదని, పై నుంచి ఖుషీ చూస్తోందని చేశానని చెబుతాడు యష్. ఆ తరువాత తడిసిన బట్టలతో ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇదంతా గమనించిన మాళవిక వారి వెంటే ఇంట్లోకి వెళుతుంది. మాళవిక రావడాన్ని గమనించిన యష్ తల్లి మాళిని ఎందకొచ్చావని అడ్డగిస్తుంది. అదే సమయంలో యష్ - వేదల బెడ్రూమ్ నుంచి మాటలు వినిపిస్తాయి. ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లినట్టుగా వాతావరణం మారుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? యష్ - వేదల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ మొదలైందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.