English | Telugu

ప్ర‌మాదంలో జాన‌కి.. ఏం జ‌రగ‌బోతోంది?

`స్టార్ మా`లో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `జాన‌కి క‌ల‌గ‌న‌లేదు`. న‌టి రాశి తొలిసారి బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చిన సీరియ‌ల్ ఇది కావ‌డం, ఇందులో ఆమె అత్త‌గా న‌టిస్తుండ‌టంతో ఈ సీరియ‌ల్ పై మ‌హిళా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్‌ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఈ రోజు 218వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ సంద‌ర్‌భంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోనున్నాయి? .. ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది అన్న‌ది ఒక‌సారి చూద్దాం.

మొత్తానికి రామాకి నిజం తెలుస్తుంది. జాన‌కి కొండ‌బాబుని కొట్ట‌డానికి కార‌ణం త‌న ప్రేమ విష‌య‌మే అని అన్న‌య్య రామాతో చెబుతుంది వెన్నెల‌. ఈ విష‌యం తెలియ‌క జాన‌కిని రాశి ఇంట్లోంచి, రామా జీవితంలోకి వెళ్లిపోమ‌ని బ‌య‌టికి గెంటేస్తుంది. దీంతో జాన‌కి బ‌స్ స్టాప్‌లో కూర్చుని త‌న భ‌ర్త‌కు నిజం చెప్ప‌లేక‌పోయాన‌ని మ‌ద‌న‌ప‌డుతూ వుంటుంది. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య దాప‌రికాలుఉండ‌కూడ‌ద‌ని అనుకున్నాం. కానీ ఈ రోజు వెన్నెల విష‌యంలో త‌న భ‌ర్త ద‌గ్గ‌ర నిజం దాచాల్సి వ‌చ్చింది. న‌న్ను క్ష‌మించండి రామాగారూ అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటుంది జాన‌కి.

Also Read: రుద్రాణి వంటింట్లో దీప.. ఏం జ‌రుగుతోంది?

క‌ట్ చేస్తే.. క‌న్న‌బాబు ప‌గ‌తో క‌గిలిపోతుంటాడు. కార్పొరేట‌ర్ సునంద దేవి అత‌న్ని ఆపే ప్ర‌య‌త్నం చేస్తూ వుంటుంది. జానికి త‌న‌ని కొట్టి అవ‌మానించింద‌ని, త‌న‌పై కేసు పెట్టి జైల్లో వేయిద్ద‌మ‌నుకుంటే సునంద‌దేవి కేసు వెన‌క్కి తీసుకోమంటోంద‌ని ర‌గిలిపోతుంటాడు. ఇదిలా వుంటే జాన‌కి బ‌య‌లుదేరిన బ‌స్ కాసేప‌టికే లోయ‌లో ప‌డిపోయింద‌నే వార్త టీవీలో చూసి షాక్ అవుతాడు రామా. ప్ర‌మాదంలో ప‌ది మంది చ‌నిపోయార‌ని, అందులో జాన‌కి కూడా వుంద‌ని టీవీలో బ్రేకింగ్ రావ‌డంతో రామా మ‌రింత షాక్ కు గుర‌వుతాడు. ఇంత‌కీ ఆ ప్ర‌మాదంలో జాన‌కి వుందా? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...