English | Telugu

కృష్ణ భగవాన్ కి ఏమయ్యింది..జబర్దస్త్ కొత్త జడ్జ్ గా శివాజీ


జబర్దస్త్ షోకి కొత్త జడ్జ్ వచ్చాడు. అదేనండి కృష్ణ భగవాన్ ప్లేసులోకి హీరో శివాజీ వచ్చి కూర్చున్నాడు. ఈ వారం జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో మొత్తం భలే ఫన్నీగా ఉంది. ఎందుకంటే ప్రతీ స్కిట్ లో శివాజీని టచ్ చేసే డైలాగ్స్ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఈ షోలో కమెడియన్ కృష్ణభగవాన్, ఇంద్రజ జడ్జిలుగా వ్యవహరించారు. ఐతే ఈ జబర్దస్త్ షో రూపు రేఖలు మార్చడంతో మొదట ఇంద్రజ ఇప్పుడు కృష్ణ భగవాన్ వెళ్లిపోయారు.

ఐతే ఇందులో శివాజీ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేసేశాడు. బులెట్ భాస్కర్ యాంకర్ రష్మీతో కలిసి డాన్స్ మంచి జోష్ తో వేసాడు. అదే ఫైమతో కలిసి చాలా స్లోగ చేసేసరికి శివాజీ అదే అడిగాడు. వెంటనే భాస్కర్ "పాలరాయికి, నాపరాయికి తేడా లేదా సర్" అని కౌంటర్ వేసాడు. దాంతో శివాజీ "నువ్వు మార్బుల్ అనుకుంటున్నావా" అన్నాడు. ఇక వెంకీ మంకీస్ స్కిట్ లో తన్మయ్ వేణుకు ముద్దులు, హగ్గులు ఇచ్చేసింది. వెంటనే షోకి కొత్తగా వచ్చిన జడ్జ్ శివాజీకి కూడా ముద్దులు, హగ్గులు ఇవ్వడానికి వెళ్లబోతుంటే "నేను నీ మొగుడినే" అన్నాడు వెంకీ. "నువ్వు నా ఒక్కదానికే మొగుడివి ఆయన ఆరుగురు టీమ్ లీడర్స్ కి మొగుడు" అనేసరికి శివాజీ పడీపడీ నవ్వాడు. చాలా ఏళ్ళ వరకు మూవీస్ కి గ్యాప్ ఇచ్చిన శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకోపక్క #90s వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు జబర్దస్త్ జడ్జీగా వచ్చాడు. ఐతే ఇంతకు కృష్ణ భగవాన్ కి ఏమయ్యిందో అనే ఆందోళనలో ఉన్నారు ఆడియన్స్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...