English | Telugu
పూర్ణ తన లవర్ అంటూ షాకిచ్చిన కమెడియన్
Updated : May 14, 2022
జబర్దస్త్ కమెడియన్ నరేష్ ఉన్నట్టుండి షాకిచ్చాడు. తను సింగిల్ కాదని, నటితో ఎప్పుడో మింగిల్ అయ్యానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. తనతో కలిసి పంచుకున్న ఫొటోలు కూడా వున్నాయంటూ ఏకంగా సాక్ష్యాలని చూపించి అక్కడున్న వారిని షాక్ కు గురిచేశాడు. ఇంతకీ నరేష్ తనకు లవర్ వుందని, ఆ లవర్ కు సంబంధించిన సాక్ష్యాలని చూపించి షాకిచ్చింది ఎవరికో కాదు హీరోయిన్ పూర్ణకు. రోజాకు మంత్రి పదవి దక్కడంతో తను జబర్దస్త్ షో నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
తన స్థానంలో నటి పూర్ణ ఈ షోకు జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కామెడీ షో లో నరేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తనదైన స్కిట్ లతో ఎంటర్ టైన్ చేస్తూ మంచి తగుర్తింపుని సొంతం చేసుకున్న నరేష్ ఈ షోలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ లో నరేష్ ఏకంగా పూర్ణ, ఇంద్ర, రష్మీ గౌతమ్ లకు షాకిచ్చాడు. తను సింగిల్ కాదని, ఇప్పటికే ఓ నటితో మింగిల్ అయిపోయానని షాకిచ్చాడు.
ఆ నటి మరెవరో కాదని, తను పూర్ణ అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్క సారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఫొటోలకు పొజులిచ్చామంటూ ఫొటోలని సాక్ష్యాలుగా చూపించాడు. రాధేశ్యామ్ లోని ట్రైయిన్ షాట్... బాహుబలి లో అనుష్క, ప్రభాస్ కలిసి బాణాలు సంధించే ఫొటో ని నరేష్, పూర్ణ హెడ్ లని మార్ఫింగ్ చేసి చూపించాడు. బాహుబలి స్టిల్ చూసిన ఇదేంటని కెవ్వు కేక కార్తీక్ ప్రశ్నిస్తే `పూర్ణబలి` అంటే నరేష్ అనడంతో అంతా నవ్వేశారు. ఆ తరువాత `ఉప్పెన` చిత్రంలోని నీ కళ్లు నీలి సముద్రం` అంటూ సాగే పాటకు నరేష్, పూర్ణ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో నరేష్ కు ముద్దు పెట్టినట్టు, బుగ్గ కొరికి నట్టు పూర్ణ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.