English | Telugu

బెడిసికొట్టిన లాస్య ప్లాన్‌! ప్రేమ్‌-శ్రుతి శోభ‌నం!!

న‌టి క‌స్తూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ప్రేమ్ - శృతిల‌ని బుక్ చేసి ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించాల‌ని, తుల‌సికి మ‌నశ్శాంతి లేకుండా చేయాల‌ని లాస్య ప్లాన్ చేస్తుంది.. అయితే ఆ ప్లాన్ బెడికొట్టి ప్రేమ్ - శృతిల‌కు శోభ‌నం జ‌రిగేలా చేస్తుంది. అదేంటో.. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

పెళ్లి జ‌రిగినా కూడా ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. త‌ల్లి తుల‌సి క‌ష్ట‌ప‌డుతుంటే శోభ‌నం అక్క‌ర్లేద‌ని, తుల‌సి సంతోషంగా వున్న‌ప్పుడే మ‌నం క‌ల‌వాల‌ని ప్రేమ్ - శృతి వేరు వేరుగా వుంటుంటారు. అయితే ఈ విష‌యం లాస్య చెవిన ప‌డుతుంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించాల‌ని లాస్య ప్లాన్ చేస్తుంది. అయితే ఈ విష‌యం తెలుసుకున్న తుల‌సి .. ప్రేమ్ పై ఫైర‌వుతుంది. అత‌న్ని, శృతిని శోభ‌నానికి ఒప్పిస్తుంది.

అంతా ఏర్పాట్లు చేస్తుంటారు. లాస్య త‌న జీవితంలో ఏదైనా మంచి ప‌ని చేసిందంటే అది ఇదే. త‌ను ఏ ఉద్దేశంతో చెప్పినా ప్రేమ్ - శృతిల‌కు మంచే జ‌రిగింద‌ని, ఈ హంగామా చూస్తే లాస్య కుళ్లుకుంటుంద‌ని అన‌సూయ అంటుంది. ఇక శృతిని ప‌ట్టుకుని ఒకే టికెట్ కు రెండు సినిమాలు అన్న‌ట్టు ఒకే పెళ్లి కానీ రెండు శోభ‌నాలు అంటూ ఆట‌ప‌ట్టిస్తుంది దివ్య‌. ఈ రోజు ప్రేమ్ - శృతి మ‌ధ్య శోభ‌నం గ‌దిలో ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...