English | Telugu

ఎంత ముద్దొచ్చాడో సుధీర్‌!

కొన్నాళ్లక్రితం అనారోగ్య కారణాల వలన రోజా 'జబర్దస్త్' షోకు దూరమైన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలోకి నటి ఇంద్రజను తీసుకొచ్చారు. అయితే అతి తక్కువ సమయంలో ఇంద్రజ జడ్జిగా మెప్పించగలిగారు. తన అందం, నవ్వుతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 'జబర్దస్త్' షోలో తన మార్క్ ను క్రియేట్ చేయగలిగింది. దీంతో రోజా 'జబర్దస్త్'కు తిరిగి వచ్చినప్పటికీ ఇంద్రజను కంటిన్యూ చేయాలంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. వచ్చే గురువారం నుండి ఇంద్రజ 'జబర్దస్త్' షోలో కనిపించరు. తాజాగా విడుదలైన ప్రోమోలో రోజా ఎంట్రీ ఇచ్చి ఎంతో ఎనర్జటిక్ గా కనిపించారు. అయితే 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో మాత్రం ఇంద్రజ సందడి చేస్తున్నారు. రోజాని 'జబర్దస్త్' జడ్జిగా, ఇంద్రజను 'ఎక్స్ట్రా జబర్దస్త్' జడ్జిగా చేస్తారా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో ఇంద్రజ తన చక్కని నవ్వుతో ఆకట్టుకుంటూ సుడిగాలి సుధీర్ పై ప్రశంసలు కురిపించింది.

హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్ లు కలిపి స్కిట్ చేయగా.. ఇందులో ఆంటీ పాత్రలో కొత్త గెటప్ లో కనిపించాడు సుధీర్. ఖైదీ బట్టలు వేసుకొని.. ముఖానికి తెల్ల పౌడర్ రాసుకొని అమాయకంగా మాట్లాడుతూ ఫన్ క్రియేట్ చేశాడు. అయితే ఈ ప్రోమో చివర్లో రష్మీ.. సుధీర్ కు కన్నుకొడుతూ కవ్వించగా.. అతడి గెటప్ చూసి సంబరపడిపోయింది ఇంద్రజ. 'అయ్యో మా అబ్బాయి (సుడిగాలి సుధీర్) ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడో' అంటూ మురిసిపోయింది.