English | Telugu

సుధీర్ వెస్ట్ రష్మీ బెస్ట్..!

ఇంద్రజ ఒక్కప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఇంద్రజ తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇంద్రజ చాలా మూవీస్ లో సపోర్ట్ రోల్ కూడా చేసి ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ కామెడీ షో అయిన జబర్దస్త్ కి జడ్జ్ గా చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.

ఇంద్రజ జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలోను జడ్జ్ గా ఉంటుంది. అయితే మల్లెమాల యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా ఇంద్రజకి సంబందించిన ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో ఇంద్రజ కొన్ని సెన్సెషనల్ కామెంట్లు చేసింది. అది కూడా తన ప్రియ శిష్యుడు సుధీర్ మీద. 'చిట్ చాట్ విత్ ఇంద్రజ' అనే టైటిల్ తో రిలీజైన ఈ మినీ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. కారణం ఏంటంటే.. యాంకర్స్ లలో రష్మి, సుధీర్ లలో ఎవరు బాగా చేస్తారని అడగగా.. రష్మీ అని సమాధానమిచ్చింది ఇంద్రజ. ఎందుకంటే సుధీర్ ని అసలు యాంకర్ గా ఎప్పుడూ చూడలేదంట ఇంద్రజ. ఇక ఇప్పుడు ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా మారింది‌.

ఈ ప్రోమో రిలీజైన కొన్ని గంటల్లోనే అత్యధిక వీక్షకాధరణ పొందుతోంది. రాపిడ్ ఫైర్ లా కొన్ని ప్రశ్నలు అడిగితే ఇలా సమాధానం చెప్తారా అంటు సుధీర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ కి యాంకరింగ్ రాదా.. రష్మీ అసలు తెలుగు వచ్చా.. అంటూ ఇంద్రజపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ మిమ్మల్ని అమ్మలా చూసాడు కదా.. ఇలా ఎలా మాట్లాడతారంటు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇది ప్రోమోనే ఫూల్ ఎపిసోడ్ ఇంకా రాలేదు‌. అందులో సుధీర్ గురించి ఇంకా ఏం మాట్లాడిందో తెలియనుంది. అయితే ఇందులో హైపర్ ఆది తనపై వేసే పంచులు కూడా తనకి నచ్చవని అంది. కాగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...